OG Movie 50-day special shows: ‘హరి హర వీరమల్లు’ లాంటి ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ తో అభిమానులను తీవ్రమైన నిరాశకు గురి చేసిన పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), కేవలం రెండు నెలల వ్యవధిలోనే ‘ఓజీ'(They Call Him OG) చిత్రం తో సంతృప్తి పరిచాడు. ఈ సినిమా ఆయన ఫ్యాన్స్ కి ఇచ్చిన కిక్ మామూలుది కాదు. చెప్పాలంటే పవన్ కళ్యాణ్ రేంజ్ బ్లాక్ బస్టర్ కాదు. కానీ ఉన్నంతలో ఆయన అభిమానులకు ఇటీవల కాలంలో ఈ సినిమా ఇచ్చినంత ఆనందం ఏ సినిమా కూడా ఇవ్వలేదు. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రానికి 318 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. మూవీ టీం హిందీ వెర్షన్ ని బాగా నిర్లక్ష్యం చేసింది. ఒకవేళ హిందీ లో ఒక పెద్ద నిర్మాత ఈ సినిమాని రీ రిలీజ్ చేసుంటే మరో వంద కోట్ల గ్రాస్ వసూళ్లు కలిసొచ్చి ఉండేది.
ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ఈ నెల 13 వ తేదీతో సరిగ్గా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఓజీ మూవీ స్పెషల్ ఫ్యాన్స్ షోస్ ని ఏర్పాటు చేస్తున్నారు. ముందుగా నైజాం ప్రాంతం లో బుకింగ్స్ ని మొదలు పెట్టే పనిలో ఉన్నారు. ఇప్పటికే కరీంనగర్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టారు. మరి కాసేపట్లో హైదరాబాద్ లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించనున్నారు. హైదరాబాద్ లో మంచి ఊపు ఉంటే ఆంధ్ర ప్రదేశ్, బెంగళూరు వంటి ప్రాంతాల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టబోతున్నారు ఫాన్స్. నార్త్ అమెరికా లో కూడా ఆస్టిన్ ప్రాంతంలో స్పెషల్ ఫ్యాన్స్ షోస్ ని ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు ఫ్యాన్స్. ఓవరాల్ గా 50వ రోజు ఎట్టిపరిస్థితిలోనూ ఈ చిత్రానికి 3 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టాలని ఫ్యాన్స్ బలంగా ప్రయత్నం చేస్తున్నారు.
ఇది చాలా పెద్ద టార్గెట్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు ఏ సినిమాకు కూడా 50 డేస్ స్పెషల్ షోస్ ద్వారా ఈ స్థాయి గ్రాస్ వసూళ్లు రాలేదు. ఒకవేళ పవన్ ఫ్యాన్స్ ఈ మార్కుని అందుకుంటే మాత్రం ఆల్ టైం ఇండియన్ రికార్డు ని నెలకొల్పినట్టే. ఈ స్పెషల్ షోస్ ద్వారా వచ్చే గ్రాస్ వసూళ్లను, ఫైనల్ క్లోజింగ్ కలెక్షన్స్ కి కూడా జత చేస్తున్నారట. అంటే క్లోజింగ్ కలెక్షన్స్ 320 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు ఉండొచ్చు. డివైడ్ టాక్ తో కేవలం తెలుగు వెర్షన్ నుండి ఈ రేంజ్ గ్రాస్ రావడం అనేది చిన్న విషయం కాదు. పర్ఫెక్ట్ పాన్ ప్రకారం పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసుంటే కథ వేరేలా ఉండేదని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.