Sridevi Drama Company- Naresh: ప్రేమ పేరుతో జబర్దస్త్ కమెడియన్ దారుణంగా మోసపోయిన నిజం లేటుగా వెలుగులోకి వచ్చింది. తాజాగా నరేష్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించాడు. రెండు అడుగుల హైట్ తో చూడగానే నవ్వొచ్చే నరేష్… కామెడీ పంచ్ లకు ఫేమస్. జబర్దస్త్ సీనియర్ కమెడియన్స్ లో నరేష్ ఒకడిగా ఉన్నాడు. నరేష్ కామెడీ ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడతారు. ఆయన నటన, కామెడీ పంచెస్ చాలా సహజంగా ఉంటాయి. ఇక ఏ పాత్రకైనా చక్కగా సరిపోతాడు. అంచెలంచెలుగా ఎదిగి మంచి స్థాయికి నరేష్ చేరాడు.
జబర్దస్త్ తో పాటు బుల్లితెర ప్రత్యేక కార్యక్రమాల్లో నరేష్ తన కామెడీతో నవ్వులు పూయిస్తారు. బుల్లితెరపై ఎంతో ఎనర్జిటిక్ గా కనిపించే నరేష్ జీవితంలో లవ్ బ్రేకప్ ఉందట. ఓ అమ్మాయి దారుణంగా మోసం చేసినట్లు తాజాగా నరేష్ బయటపెట్టారు. శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. నరేష్ మంచి డాన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. అమ్మాయితో పాటు ఎమోషనల్ గా నటించి చూపించాడు. ఆ సాంగ్ కాన్సెప్ట్ ఏమిటంటే… ఒక అమ్మాయిని నరేష్ ఇష్టపడతాడు. ఆమె తనని రిజెక్ట్ చేస్తుంది.
అయితే తర్వాత దగ్గరవుతుంది. నరేష్ ని డబ్బుల కోసం వాడుకుంటుంది. ఎందుకంటే నరేష్ ని ఆమె నిజంగా ప్రేమించదు. నరేష్ వద్ద నటిస్తూ మరో అబ్బాయితో రిలేషన్ మైంటైన్ చేస్తుంది. చివరికి నిజం తెలిసి నరేష్ గుండె బద్దలవుతుంది. సాంగ్ లో ఈ కాన్సెప్ట్ మొత్తం నరేష్ పర్ఫార్మ్ చేసి చూపించాడు. పాటకు డాన్స్ చేసేటప్పుడు నరేష్ ఎమోషనల్ అయ్యాడు, ఇన్వాల్వ్ అయిపోయాడు. నరేష్ అంత సహజంగా చేయడం చూసి వేదికపై ఉన్నవారికి అనుమానం వచ్చింది. నిజంగా నీ జీవితంలో ఇలాంటిది జరిగిందా, అంత సహజంగా చేశావు? అని అడిగారు.
దానికి నిజమేనని నరేష్ ఒప్పుకున్నాడు. నిజ జీవితంలో కూడా ఓ అమ్మాయి డబ్బుల కోసం ప్రేమిస్తున్నట్లు నటించి మోసం చేసింది అన్నాడు. వేరే వ్యక్తిని ప్రేమిస్తూ తనని వాడుకున్నట్లు చెప్పి బాధపడ్డాడు. పొట్టి నరేష్ జీవితంలో జరిగిన దారుణ సంఘటన గురించి తెలుసుకొని అందరూ బాధపడ్డారు. ప్రేమ చాలా మంది వీక్నెస్ గా ఉంటుంది. దాన్ని కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు క్యాష్ చేసుకుంటారు. ఈ రోజుల్లో నిజమైన ప్రేమ దొరకడం కష్టమే. కాగా గతంలో నరేష్ వివాహం చేసుకున్నాడు.కారణం తెలియదు కానీ అతని వైఫ్ ఆత్మహత్య చేసుకొని మరణించాడు. ఆ సంఘటన ఆయన్ని కృంగదీసింది. నరేష్ ప్రస్తుత వయసు 25 ఏళ్ల వరకు ఉంటుంది.