Allu Arjun – Trivikram: కొన్ని కాంబినేషన్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబో అలాంటిదే. జులాయి చిత్రంతో మొదలైన వీరి ప్రయాణం కొనసాగుతుంది. త్రివిక్రమ్ అత్యధికంగా పని చేసిన హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సూపర్ హిట్ కొట్టాయి. హ్యాట్రిక్ మూవీ అల వైకుంఠపురంలో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. అల్లు అర్జున్ కెరీర్లో ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ అల వైకుంఠపురంలో కావడం విశేషం.
అల వైకుంఠపురంలో భారీ వసూళ్లు రాబట్టింది. 2020 సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఈ హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుంది. అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం త్రివిక్రమ్ తో చేస్తున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పుష్ప 2 అనంతరం అల్లు అర్జున్ ఏ దర్శకుడితో చిత్రం చేస్తారనే సస్పెన్సు ఉంది. దానికి నేడు తెరపడింది.
అల్లు అర్జున్ 2024 ఫిబ్రవరికల్లా పుష్ప 2 షూటింగ్ పూర్తి చేయనున్నారు. పుష్ప 2 సమ్మర్ కానుకగా విడుదల కానుంది. మరోవైపు త్రివిక్రమ్ గుంటూరు కారం మూవీతో బిజీగా ఉన్నారు. గుంటూరు కారం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. దీంతో ఫిబ్రవరి తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ తమ తమ ప్రాజెక్ట్స్ నుండి బయటపడతారు. పెద్దగా విరామం తీసుకోకుండా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తారట. ఇక తమ కాంబోలో వచ్చిన గత చిత్రాలకు మించి భారీ స్థాయిలో తెరకెక్కించనునట్లు తెలియజేశారు.
ఇతర నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. ఇది పాన్ ఇండియా మూవీ అనడంలో సందేహం లేదు. అల్లు అర్జున్ ఇమేజ్ రీత్యా ఐదు భాషల్లో అందుబాటులోకి రానుంది. అయితే త్రివిక్రమ్ కథలన్నీ ఫ్యామిలీ డ్రామాలుగా ఉంటాయి. ఇతర భాషల్లో త్రివిక్రమ్ కథలకు ఆదరణ ఉండదు. త్రివిక్రమ్ రీమేక్ సినిమా ఒక్కటి కూడా ఇతర భాషల్లో ఆడలేదు. కాబట్టి అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ కోసం ఎలాంటి కథ సిద్ధం చేశారన్నది ఆసక్తికరం.
The Dynamic duo reunite for the 4th time! 😍🌟
Icon StAAr @alluarjun & Our Darling director #Trivikram garu coming together for our #Production8 🤩
More Details Soon! 🔥#AlluAravind #SRadhaKrishna @haarikahassine @GeethaArts pic.twitter.com/Trd5To14h5
— Haarika & Hassine Creations (@haarikahassine) July 3, 2023