Allu Sirish Buddy: అల్లు అరవింద్ మూడో కుమారుడు అల్లు శిరీష్.. సినిమా ఇండస్ట్రీకి వచ్చి దశాబ్దం దాటిపోయింది. అయినప్పటికీ ఇప్పటివరకు ఇది నాది అని చెప్పుకోదగ్గ సినిమా అతనికి పడలేదు. గత ఏడాది “ఊర్వశివో రాక్షసివో” అనే సినిమా విడుదలైంది. అను ఇమ్మానుయేల్ తో ఇతడి కెమిస్ట్రీ వర్కౌట్ అయింది. కానీ సినిమా జనాలకు పెద్దగా రీచ్ కాలేదు.. ఇక అప్పటినుంచి ఏ సినిమా తీయాలో అనే డైలామా లో ఉన్న అల్లు శిరీష్.. ఏకంగా తమిళనాడు దర్శకులను నమ్ముకున్నాడు. ఈసారి లవ్ స్టోరీ కాకుండా థ్రిల్లర్, యాక్షన్ జోనర్ ను నమ్ముకున్నాడు. అందుకు తగ్గట్టుగానే ఈ సినిమా గ్లింప్స్ ద్వారా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు.
బలమైన ఎలిమెంట్ తో..
సాధారణంగా థ్రిల్లర్ సినిమాల్లో ప్రేక్షకులను కట్టిపడేసే ఒక బలమైన ఎలిమెంట్ ఉంటుంది. ఈ సినిమాలో బలమైన ఎలిమెంట్ ఏంటో దర్శకుడు రివిల్ చేయకపోయినప్పటికీ ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు.. ఎందుకంటే ఒక మెట్రో ట్రైన్ లో ఒక విలన్ ముఖానికి మాస్క్ వేసుకొని తన అనుచరులను భయపెడుతూ ఉంటాడు. వాళ్లు ఆశ్చర్యపోయేంత అమౌంట్ చూపిస్తాడు. తన ప్లాన్ ఏంటో ఎగ్జిక్యూట్ చేయాలని వారికి ఆదేశాలు జారీ చేస్తాడు. ఇలా సాగిపోతున్న గ్లింప్స్ లో సడన్ గా అల్లు అర్జున్ ఎంట్రీ ఇస్తాడు. చూడబోతే అతని రోల్ కాప్ అని తెలుస్తోంది. నీట్ షేవింగ్ లో, ఫార్మల్ డ్రెస్ లో అల్లు అర్జున్ చూసేందుకు చూడముచ్చటగా ఉన్నాడు. గన్ కూడా చాలా స్టైలిష్ గా కాల్చాడు. అతడి తూటాల దెబ్బకు విలన్లు ఒక్కొక్కరుగా నేలకు ఒరుగుతున్నారు. చివరికి బడ్డీ రూపంలో ఉన్న ఒక కదిలే బొమ్మ కూడా తుపాకీ పేల్చడం విశేషం. అయితే ఈ బొమ్మ కోసం విలన్ గ్యాంగ్ ఎందుకు అంత ఆసక్తి చూపిస్తుందనేది సినిమా చూస్తేనే తెలుస్తుందని సినిమా బృందం చెప్పకనే చెప్పింది.
జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో..
ఇక ఈ సినిమాని కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈయన మరెవరో కాదు తమిళంలో స్టూడియో గ్రీన్ అనే సంస్థను ఏర్పాటుచేసి సూర్య, కార్తితో పలు విజయవంతమైన సినిమాలు నిర్మించారు. అయితే ఈసారి అల్లు శిరీష్ తో బండి అనే పేరుతో తెలుగు, తమిళం భాషలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి సామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు.. హిప్ హాప్ ఆది సంగీతం సమకూర్చుతున్నారు. అల్లు శిరీష్ సరసన ప్రిషా రాజేష్ సింగ్ కథానాయకగా నటిస్తోంది. అజ్మల్ అమీర్ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నాడు. సినిమా గ్లింప్ విడుదలకు ముందు వెల్కమ్ టు టెడ్డీ వరల్డ్ అని క్యాప్షన్ ఇచ్చారంటే.. బొమ్మల నేపథ్యంలో సినిమా సాగుతుందని తెలుస్తోంది. అయితే కథ, కథనం పూర్తి కొత్తగా ఉన్న నేపథ్యంలో ఈసారి అల్లు శిరీష్ కచ్చితంగా హిట్ కొడతాడు అనిపిస్తోంది.