https://oktelugu.com/

Mathu Vadalara 2: ‘మత్తు వదలరా 2 ‘ సూపర్ హిట్ అవ్వడంపై ఆ చిత్ర హీరో ‘శ్రీసింహ’ అసహనం..ఏడవడం ఒక్కటే తక్కువ పాపం!

భవిష్యత్తులో ఈ చిత్రం ఇంకా లాభాలను తెచ్చి పెట్టే అవకాశాలు ఉన్నాయి. 'దేవర' చిత్రం విడుదలయ్యే వరకు ఈ సినిమాకి థియేటర్స్ లో మంచి షేర్ వసూళ్లు వస్తాయని ఆశిస్తున్నారు ట్రేడ్ పండితులు.

Written By:
  • Vicky
  • , Updated On : September 20, 2024 / 04:38 PM IST

    Mathu Vadalara 2

    Follow us on

    Mathu Vadalara 2: ఈ ఏడాది చిన్న సినిమాల హవా ఏ రేంజ్ లో కొనసాగుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలుస్తూ బయ్యర్స్ కి, నిర్మాతలకి భారీ నష్టాలు కలగచేయగా, చిన్న సినిమాలు మాత్రం సూపర్ హిట్స్ గా నిల్చి టాలీవుడ్ పరువు కాపాడాయి. అలా రీసెంట్ గా విడుదలైన మరో చిన్న సినిమా ‘మత్తు వదలరా 2’ కూడా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. 2019 లో విడుదలైన ‘మత్తు వదలరా’ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాకి మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ వచ్చింది. టాక్ తగ్గట్టుగానే వసూళ్లు కూడా రాబడుతూ ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకొని వెళ్తుంది. కేవలం నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కు ని సాధించిన ఈ చిత్రం ఇప్పటి వరకు బయ్యర్స్ కి 3 కోట్ల రూపాయిల లాభాలను తెచ్చిపెట్టింది.

    భవిష్యత్తులో ఈ చిత్రం ఇంకా లాభాలను తెచ్చి పెట్టే అవకాశాలు ఉన్నాయి. ‘దేవర’ చిత్రం విడుదలయ్యే వరకు ఈ సినిమాకి థియేటర్స్ లో మంచి షేర్ వసూళ్లు వస్తాయని ఆశిస్తున్నారు ట్రేడ్ పండితులు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యినప్పటికీ కూడా హీరో గా నటించిన శ్రీ సింహా కు ఆనందం లేదట. ఎందుకంటే అంత కష్టపడి సినిమా చేస్తే అందరూ సత్య గురించే మాట్లాడుకుంటున్నారు కానీ, నేను సినిమాలో ఉన్నాను అనే విషయాన్ని కూడా జనాలు పట్టించుకోవడం లేదంటూ తన సన్నిహితుల వద్ద చెప్పుకొని శ్రీ సింహా బాధపడ్డాడు అట. రీసెంట్ గా సోషల్ మీడియా లో ‘మత్తువదలరా 2 ‘ కి సంబంధించిన పోస్టులకు రెస్పాన్స్ ఇస్తూ మూవీ టీం ఒక వీడియో చేసింది. ఈ వీడియోలో హీరోయిన్ ఫైరా అబ్దుల్లా, శ్రీ సింహా, సత్య, రితేష్ రానా పాల్గొన్నారు. నెటిజెన్స్ పెట్టిన పోస్టులను చదువుతుండగా, ప్రతీ ఒక్కరు సత్య కామెడీ టైమింగ్ గురించి, రితేష్ రానా దర్శకత్వ ప్రతిభ గురించి పొగుడుతూ ట్వీట్లు వేశారు.

    కొంతమంది ఫైరా అబ్దుల్లా గురించి కూడా పొగిడారు. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా హీరో గా నటించిన శ్రీ సింహా ని మాట వరసకు కూడా తల్చుకోలేదు. పాపం ఆ వీడియో లో అతనికి ఏడవడం ఒక్కటే తక్కువ అయ్యింది. కీరవాణి కొడుకుగా ‘మత్తు వదలరా’ చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి హీరో గా పరిచయమైన శ్రీ సింహా, ఆ తర్వాత ‘భాగ్ సాలే’, ‘దొంగలున్నారు జాగ్రత్త’, ‘ఉస్తాద్’ , ‘తెల్లవారితే గురువారం’ వంటి చిత్రాలు చేసాడు. వీటిలో ఒక్క సినిమా కూడా కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదు. మళ్ళీ ఇన్నాళ్లకు ఆయనకు ‘మత్తు వదలరా 2’ ద్వారానే హిట్ తగిలింది. రాక రాక వచ్చిన సూపర్ హిట్ సినిమాలో కూడా అతనికి గుర్తింపు దక్కకపోవడం బాధాకరమే, భవిష్యత్తులో అయినా శ్రీ సింహా కి ప్రేక్షకులకు గుర్తించుకోదగ్గ పాత్రలు లభిస్తాయో లేదో చూడాలి.