Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు – సెన్స్ బుల్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘సర్కారు వారి పాట’. కాగా తాజాగా జరుగుతున్న షెడ్యూల్ లో మహేష్ కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. మార్చి చివరి నాటికి ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

ఇక ఈ ‘సర్కారు వారి పాట’ నుంచి లవ్ సాంగ్ రాబోతుంది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ పై ఇప్పటికే చిత్రబృందం క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం లోని మొదటి పాట పేరు ‘కళావతి’. చంద్రబోస్ రాసిన ఈ లవ్ సాంగ్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుందట. మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా రానున్న ఫస్ట్ సింగిల్‌ను ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ఇటీవల పోస్టర్ రిలీజ్ చేసి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
Also Read: అభిమాని కుమార్తె పెళ్లికి మెగాస్టార్ సర్ ప్రైజ్ గిఫ్ట్
కాగా దీనికి సంబంధించిన మరో అప్ డేట్ వినిపిస్తోంది. ఈ పాటలో కీర్తి సురేష్ వెరీ బోల్డ్ గా కనిపించబోతుందట. ఇక ఈ పాట ప్రేమికుల దినోత్సవం రోజున రానుండటంతో లవ్ సాంగ్ అనే ప్రచారం జరుగుతోంది. కాగా ఈ సాంగ్ లో మహేష్, హీరోయిన్ కీర్తి సురేష్, అలాగే కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా కనిపించబోతున్నారు.

మొత్తానికి ‘సర్కారు వారి పాట’ భారీ కమర్షియల్ హిట్ అయ్యేలా ఉందని మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. కాగా మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.
Also Read: పెద్ద హిట్ అవుతుందట.. కబుర్లు చెబుతున్న మిస్ ఇండియా !
[…] Oscars 2022: ఆస్కార్ సందడి షురూ అయింది. మార్చి 27న జరగనున్న 94వ ఆస్కార్ పురస్కార వేడుకల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎంతైనా సినీ ప్రేమికులకు కూడా ఆస్కార్ అవార్డ్ ఓ కలల స్వప్నం. అందుకే.. ప్రపంచ సినీ లోకంలో ఆస్కార్ కి తిరుగులేకుండా పోయింది. ఒక్కసారైనా ఆస్కార్ అవార్డ్ ను అందుకోవాలని, కనీసం ఆస్కార్ కోసం పోటీపడాలని కలలు కంటూ కాలం వెళ్లదీస్తూ ఉంటారు. ఇక ఆస్కార్ పోటీలో వివిధ విభాగాల్లో పోటీపడ్డాయి పలు చిత్రాలు. […]