Devara Movie Twitter Talk : ఆచార్య’ కి దర్శకత్వం వహించింది చిరంజీవి కాదు..కొరటాల శివనే!..’దేవర’ ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే!

ఆరేళ్ళ తర్వాత ఆయన నుండి వస్తున్న సోలో చిత్రం కావడంతో కేవలం అభిమానులు మాత్రమే కాదు, ప్రేక్షకులు కూడా ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూసారు. టీజర్, పాటలు కూడా బాగా ఆకట్టుకోవడం వల్ల ఈ సినిమాపై అంచనాలు మరింత పెరగడానికి కారణం అయ్యాయి. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి ట్విట్టర్ లో డివైడ్ టాక్ వచ్చింది.

Written By: Vicky, Updated On : September 27, 2024 10:13 am

Devara Movie Twitter Talk

Follow us on

Devara Movie Twitter Talk : ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైన సంగతి మన అందరికీ తెలిసిందే. రెండు తెలుగు రాష్ట్రాల్లో అర్థ రాత్రి నుండే ఈ సినిమాకి బెన్ఫిట్ షోస్ ప్రారంభం అయ్యాయి. ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే దాదాపుగా 535 మిడ్ నైట్ షోస్ పడ్డాయంటే ఎన్టీఆర్ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఆరేళ్ళ తర్వాత ఆయన నుండి వస్తున్న సోలో చిత్రం కావడంతో కేవలం అభిమానులు మాత్రమే కాదు, ప్రేక్షకులు కూడా ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూసారు. టీజర్, పాటలు కూడా బాగా ఆకట్టుకోవడం వల్ల ఈ సినిమాపై అంచనాలు మరింత పెరగడానికి కారణం అయ్యాయి. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి ట్విట్టర్ లో డివైడ్ టాక్ వచ్చింది.

సినిమా మొదలై 45 నిమిషాల వరకు చాలా స్లో స్క్రీన్ ప్లే తో నడుస్తుందని, కానీ ఆ తర్వాత వచ్చే ‘ఫియర్’ సాంగ్ నుండి, ప్రీ క్లైమాక్స్ వరకు అదిరిపోతుందని, ఇక ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా వేరే లెవెల్ లో వచ్చిందని ట్విట్టర్ లో నెటిజెన్స్ చెప్పుకొచ్చారు. ఇక సెకండ్ హాఫ్ మీద భారీగా అంచనాలు పెరుగుతాయి. కానీ సెకండ్ హాఫ్ ప్రారంభం నుండే అభిమానులను కొరటాల శివ తన నీరసంగా టేకింగ్ తో ప్రారంభం నుండే చిరాకు కలిగించాడని, అసలు ఈ చిత్రం లో జాన్వీ కపూర్ ఎందుకు ఉందో అర్థం కావట్లేదని, ఎదో బాహుబలి తరహా స్టోరీ అయ్యినట్టు, రెండవ పార్ట్ కి స్కోప్ లేకపోయినా కూడా సీక్వెల్ తీసేందుకు హింట్స్ ఇవ్వడం ఎందుకో అర్థం కాలేదంటూ అభిమానులు సైతం చెప్పుకొచ్చారు. ఇది ఇలా ఉండగా కొరటాల గత చిత్రం ‘ఆచార్య’ అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఆ చిత్రం పెద్ద ఫ్లాప్ అవ్వడం తో అనేక మంది ఇతర హీరోల అభిమానులు ‘చిరంజీవి దర్శకత్వం లో వేలు పెట్టి మొత్తం గెలికేసాడని, స్క్రిప్ట్ మొత్తం మార్చేసాడని, ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమాకి డైరెక్టర్ చిరంజీవే’ అంటూ ట్విట్టర్ లో కామెంట్స్ చేసేవారు.

కానీ ఇప్పుడు వాళ్ళు మనం పొరపాటు పడ్డాము, ‘ఆచార్య’ కి దర్శకత్వం వహించింది కొరటాల శివనే, చిరంజీవి కాదు, ఇలాంటి టేకింగ్ కొరటాలకు మాత్రమే సాధ్యం అంటూ ట్వీట్స్ వేశారు. అయితే కొరటాల శివ సినిమాలు ముందుగా డివైడ్ టాక్ తోనే ప్రారంభం అవుతాయి. ‘జనతా గ్యారేజ్’ చిత్రం కూడా ప్రారంభం లో నెగటివ్ టాక్ తోనే మొదలైంది. కానీ సినిమాలో దమ్ము ఉండడం తో సాయంత్రం లోపు సూపర్ హిట్ తో సెటిల్ అయ్యింది. ‘దేవర’ కూడా అలాంటి దమ్ము ఉన్న సినిమానే అని కొంతమంది నెటిజెన్స్ అంటున్నారు, కాకపోతే భారీ అంచనాలు ఉండడం వల్ల నెగటివ్ టాక్ వచ్చింది. చూడాలి మరి ఈ చిత్రం ‘జనతా గ్యారేజ్’ లాగా మ్యాజిక్ క్రియేట్ చేస్తుందా లేదా అనేది.