Koratala Siva Devara: టాలీవుడ్ లో టాప్ మోస్ట్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో కొరటాల శివ(Koratala Siva) పేరు కచ్చితంగా ఉంటుంది. ఒక సాధారణ రచయితా గా కెరీర్ ని మొదలు పెట్టి, ‘మిర్చి’ చిత్రం తో డైరెక్టర్ గా మారి, తొలిసినిమాతోనే భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు. ఇక ఆ తర్వాత మహేష్ బాబు తో చేసిన ‘శ్రీమంతుడు’, ఎన్టీఆర్ తో చేసిన ‘జనతా గ్యారేజ్’, మళ్ళీ మహేష్ బాబు తో చేసిన ‘భరత్ అనే నేను’ చిత్రాలు కమర్షియల్ గా ఒక దానిని మించి ఒకటి సూపర్ హిట్ అవుతూ రావడంతో కొరటాల శివ పేరు టాలీవుడ్ లో మారుమోగిపోయింది. కానీ ఎప్పుడైతే మెగాస్టార్ చిరంజీవి తో ‘ఆచార్య’ చిత్రం చేసాడో, అప్పటి నుండి ఆయనకు బ్యాడ్ టైం మొదలైంది. ఈ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ అయినప్పటికీ కూడా కొరటాల శివకు పిలిచి మరీ ‘దేవర’ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చాడు ఎన్టీఆర్(Junior NTR).
ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అయితే అయ్యింది కానీ, కొరటాల శివ కెరీర్ కి ఏమాత్రం ఉపయోగపడలేదు. ఎందుకంటే ఈ చిత్రానికి కూడా ఆయన బలమైన స్క్రీన్ ప్లే రాసుకోలేదు. తీసిన అనేక సన్నివేశాలు విమర్శలకు గురయ్యాయి. కేవలం ఎన్టీఆర్ నటన మరియు అనిరుద్ అందించిన అద్భుతమైన పాటలు,బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వల్ల ఈ సినిమా సేవ్ అయ్యింది, లేకపోతే మరో ఆచార్య లాంటి డిజాస్టర్ అయ్యేదని విశ్లేషకులు సైతం తమ అభిప్రాయాన్ని ఈ సినిమా విడుదల సమయంలో వ్యక్తం చేశారు. అందుకే దేవర హిట్ క్రెడిట్ మొత్తం ఎన్టీఆర్,అనిరుద్ ఖాతాలోకి వెళ్ళింది. కొరటాల శివ కి ఇసుమంత క్రెడిట్ కూడా దక్కలేదు. ఫలితంగా ఏ పాన్ ఇండియన్ స్టార్ హీరో కూడా అతనితో సినిమా చేయడానికి సిద్ధం లేదు. దీంతో ఆయన కేవలం ‘దేవర 2′(Devara 2 Movie) పైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మొత్తం డైలాగ్ వెర్షన్ తో సహా సిద్ధం చేసుకొని ఎన్టీఆర్ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాడట కొరటాల శివ. ఎన్టీఆర్ కచ్చితంగా చేద్దామని అంటున్నాడు కానీ, ఎప్పటి నుండి చేస్తాడు అనే దానిపై క్లారిటీ ఇవ్వట్లేదట. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఆయన ‘జైలర్’ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాక ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాని మొదలు పెడుతాడు. ఇలా ఎన్టీఆర్ లైనప్ మొత్తం లాక్ అయిపోయింది. ఈ సినిమాలన్నీ పూర్తి అయిన తర్వాతనే ‘దేవర 2 ‘ గురించి ఆలోచించే పరిస్థితి ఉంది. అంటే మూడేళ్లకు పైగానే సమయం పడుతుంది . అప్పటి వరకు కొరటాల శివ ఖాళీగా ఉండాల్సిందేనా?, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.