Mona Lisa : మహాకుంభ్ 2025లో తన అందమైన కళ్లతో అందరినీ పిచ్చెక్కించిన మోనాలిసా, రాత్రికి రాత్రే తన అదృష్టాన్ని పెంచుకుంది. మోనాలిసా ఇప్పుడు హీరోయిన్‌గా మారబోతోంది. అవును, దర్శకుడు సనోజ్ మిశ్రా మోనాలిసాతో ది డైరీ ఆఫ్ మణిపూర్ కోసం సంతకం చేశారట. ఇందులో ఆమె రాజ్‌కుమార్ రావు అన్నయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో మోనా తన చదువును వదిలేసిందని, ఆమె దండలు అమ్మే పని చేసేదని మీకు తెలుసు కదా.. 2025 మహాకుంభ్‌లో కూడా, ఆమె రుద్రాక్ష రోజరీని విక్రయిస్తూ వైరల్ గా మారింది. మోనా అదృష్టం రాత్రికి రాత్రే మారిపోయింది. తన గురించి ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.
‘మోనాలిసా’ ఎవరు?
మోనాలిసా 21 జనవరి 2009న మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్‌లో ఒక హిందూ కుటుంబంలో జన్మించింది. ప్రస్తుతం ఆమె వయస్సు 16 సంవత్సరాలు. ‘మోనాలిసా’ చాలా సాధారణ, పేద కుటుంబంలో జన్మించింది. అందుకే ఆమె 12 సంవత్సరాల వయస్సులో తన చదువును విడిచిపెట్టి, తన కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయడానికి దండలు అమ్మే పని చేస్తుంది.
చదువు మానేసినప్పటి నుంచి ‘మోనాలిసా’ తన కుటుంబ వ్యాపారానికి సాయం చేస్తోంది. ఈ కారణంగా, ఆమె రుద్రాక్ష పూసలను విక్రయించడానికి మహాకుంభానికి వచ్చింది. కానీ ఆమె కొన్ని చిత్రాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ‘మోనాలిసా’ ఇంటర్నెట్‌లో ఫుల్ వైరల్ గా మారింది. తన హాజెల్ కళ్ళు అందరి దృష్టిని ఆకర్షించాయి. ప్రజలు ఆమెను బాలీవుడ్ హీరోయిన్లతో పోల్చడం ప్రారంభించారు. మోనాలిసా ముదురు రంగు, లేత గోధుమరంగు కళ్ళు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారాయి. ఈమె గురించి ఎక్కువగా వైరల్ అవడంతో ప్రజలు ‘మోనాలిసా’ చుట్టూ గుమిగూడారు. దీంతో ఆమె తండ్రి కలత చెంది ఆమెను ఇంటికి పంపారు.
బాలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చింది
అదృష్టం రాత్రికి రాత్రే మారిపోతుంది అనడానికి ‘మోనాలిసా’కి సరిగ్గా సరిపోతుంది. మహాకుంభ్ నుంచి వైరల్ అయిన అమ్మాయి ఇప్పుడు బుల్లితెరపై తన అందం, ప్రతిభ మ్యాజిక్‌ను చేయడానికి సిద్ధంగా ఉంది. గాంధీగిరి, ది డైరీ ఆఫ్ బెంగాల్ వంటి చిత్రాలను రూపొందించిన దర్శకుడు సనోజ్ మిశ్రా తన తదుపరి చిత్రానికి మోనాలిసాతో సంతకం చేశారు. అవును, సనోజ్ తన చిత్రం ది డైరీ ఆఫ్ మణిపూర్ కోసం మోనాలిసాను ఒప్పించారట. దీనికి మోనాలిసా తన కుటుంబ సభ్యుల సమ్మతిని కూడా పొందింది. ప్రముఖ నటుడు రాజ్‌కుమార్‌రావు అన్నయ్య అమిత్‌రావు ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించబోతున్నారు.
మోనాలిసాకు ఇష్టమైన నటుడు ఎవరు?
మోనాలిసాకు ఇప్పటికే నటన అంటే చాలా ఇష్టమని, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రీల్స్‌ను పోస్ట్ చేస్తూ తెలిపింది. తన అభిమాన బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ అని అభిమాన నటి సోనాక్షి సిన్హా అని తెలిపింది. ఇక మొత్తం మీద ఈ సినిమాతో నటి కావాలనే మోనాలిసా కల కూడా నెరవేరబోతోంది. ఇక సనోజ్ కుమార్ సినిమాల గురించి చూసినట్టు అయితే ‘ది డైరీ ఆఫ్ వెస్ట్ బెంగాల్’, ‘శశాంక్’, ‘గజ్నవి’, ‘శ్రీనగర్’, ‘రామ్ కీ జన్మభూమి’, ‘గాంధీగిరి’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.