Tandel : అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కిన రెండవ చిత్రం ‘తండేల్’ మరో 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. చందు మొండేటి దర్శకత్వం లో, అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సుమారుగా 80 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో నిర్మించాడు. నిన్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరుపుకోవాల్సింది. కానీ ఈ ఈవెంట్ కి గెస్ట్ గా రాబోతున్న అల్లు అర్జున్ అందుబాటులో లేకపోవడంతో నిన్న జరగాల్సిన ఈవెంట్ నేడు జరుగుతుంది. ఈ ఈవెంట్ కి అల్లు అర్జున్ తో పాటు మూవీ టీం మాత్రమే ఉంటుంది. అభిమానులకు ఎంట్రీ లేదట. సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో నాలుగు రోజుల క్రితమే మొదలైంది.
పాటల ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న ఈ చిత్రానికి కచ్చితంగా భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వస్తాయని అందరు అనుకున్నారు. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఇలాంటి సినిమాలకు కుంభస్థలమే అని చెప్పొచ్చు. కేవలం ఒక్క నార్త్ అమెరికా కి ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 14 లక్షల డాలర్లకు అమ్ముడుపోయాయట. ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కేవలం 30 వేల డాలర్లు మాత్రమే వచ్చినట్టు తెలుస్తుంది. ఫైనల్ గా ప్రీమియర్ షోస్ కి అడ్వాన్స్ బుకింగ్స్ నుండి లక్షకు పైగా గ్రాస్ వస్తుందని, ఓవరాల్ గా ప్రీమియర్స్ ముగిసే సమయానికి నాలుగు లక్షల డాలర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. నాగ చైతన్య మార్కెట్ కి ఇది బెస్ట్ ఓపెనింగ్ అయినప్పటికీ, పెరిగిన ఓవర్సీస్ మార్కెట్ కి, ఈ చిత్రానికి ఉన్న హైప్ కి ఇంకా ఎక్కువ వసూళ్లు రావాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్ ఊపు అందుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అనేక సినిమాలకు ఇలాగే జరిగింది. పెద్ద హీరోల సినిమాలకు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైప్ పై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం హైప్ ఉంటే తప్ప ఒక సినిమాకి ఓపెనింగ్స్ రావడం చాలా కష్టమైంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఓవర్సీస్ బుకింగ్స్ పరిస్థితి ఇలా ఉంటే, తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఈరోజు సాయంత్రం నుండి, లేదా రేపటి నుండి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయట. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ షోని కొంతమంది ప్రముఖులకు వేసి చూపించగా, వాళ్ళ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి UA సర్టిఫికేట్ ని జారీ చేసారు. చూడాలి మరి ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఏమేరకు సక్సెస్ అవుతుంది అనేది.