Prashanth Neel: ప్రశాంత్ నీల్ ని భయపెడుతున్న ఆ స్టార్ హీరో అభిమానులు…

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఉన్న కమిట్ మెంట్లు వలన ఆయన బిజీగా ఉన్నాడు. అలాగే మహేష్ బాబు కూడా రాజమౌళి సినిమాలో చాలా బిజీగా తిరుగుతున్నాడు.

Written By: Gopi, Updated On : January 3, 2024 2:00 pm

Prashanth Neel

Follow us on

Prashanth Neel: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ లో ఎవరు ఉంటే వాళ్ళ ట్రెండ్ అనేది నడుస్తూ ఉంటుంది. అది హీరో అయిన హీరోయిన్ అయిన, డైరెక్టర్ అయిన ఇక ఇప్పుడు సలార్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ప్రశాంత్ నీల్ కి మంచి అవకాశాలు వస్తున్నట్టు గా తెలుస్తుంది.ఇక ఇప్పుడు ఆయన జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు.

ఇక ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే ప్రశాంత్ నీల్ మార్కెట్ భారీగా పెరుగుతుంది అని చెప్పడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇది ఇలా ఉంటే తెలుగులో సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన మహేష్ బాబు అభిమానులు మాత్రం మహేష్ బాబు తన కెరీర్ లో ఒక్కసారైనా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేయాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ప్రశాంత్ నీల్ హీరోలకి చాలా ఎలివేషన్స్ ఇస్తూ హీరో క్యారెక్టర్జేషన్ ని చాలా బాగా డిజైన్ చేసుకుంటాడు కాబట్టి ఆయన డైరెక్షన్ లో సినిమా చేస్తే ఆ హీరోకి మంచి గుర్తింపు రావడమే కాకుండా హీరో రేంజ్ కూడా పెరుగుతుందనే ఉద్దేశంలోనే వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.

మరి ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ఉన్న కమిట్ మెంట్లు వలన ఆయన బిజీగా ఉన్నాడు. అలాగే మహేష్ బాబు కూడా రాజమౌళి సినిమాలో చాలా బిజీగా తిరుగుతున్నాడు. కాబట్టి ఇద్దరు ఫ్రీ అయిన తర్వాత ఇంకో మూడు సంవత్సరాలైనా పర్లేదు అప్పుడైనా వీళ్ళ కాంభినేషన్ లో సినిమా రావాలని సోషల్ మీడియా వేదికగా మహేష్ అభిమానులు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక మహేష్ అభిమానులు మా మహేష్ బాబు తో సినిమా ఎప్పుడు చేస్తారు సార్ అంటూ చాలామంది ప్రశాంత్ నీల్ కి మెసేజ్ లు పెడుతున్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలైతే వస్తున్నాయి.

మరి వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే సినిమా ఎప్పుడు వస్తుంది అనేది తెలియాల్సి ఉంది.ఇక ప్రశాంత్ నీల్ కూడా మహేష్ బాబు తో సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది.కానీ ఇప్పుడన్నా కమిట్ మెంట్స్ వలన ప్రాజెక్టు అనేది కొద్ది రోజులు లేటయ్యే అవకాశం అయితే ఉంది…ఇక ప్రస్తుతం మహేష్ రాజమౌళి తో సినిమా చేస్తున్నాడు కాబట్టి ఈ సినిమా పూర్తి అయ్యేసరికి ఒక మూడు సంవత్సరాలు ఈజిగా పడుతుంది.