The Family Man Season 3 Poster: ఇండియాలో ప్రస్తుతం ఉన్న రోజుల్లో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లకు కూడా చాలా మంచి ఆదరణ అయితే దక్కుతుంది. ముఖ్యంగా ఫ్యామిలీ మెన్ సిరీస్ కి ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. ఇప్పటివరకు ఈ సిరీస్ నుంచి రెండు సీజన్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడంతో ప్రస్తుతం మూడోవ సిరీస్ ఎప్పుడు వస్తుంది అనే దాని మీద ప్రతి ఒక్కరు చాలా రోజుల నుంచి ఈ సిరీస్ కోసం విపరీతంగా ఎదురుచూస్తున్నారు. ఇంకా దానికి సంబంధించిన అప్డేట్ ను ఇస్తూ ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం అందరి కళ్ళు ఫ్యామిలీ మెన్ సిరీస్ మీదనే ఉన్నాయి. తొందర్లోనే ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది’ అంటూ క్యాప్షన్ పెడుతూ ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో మనోజ్ భాజ్ పాయ్ (Manoj Bajpaay) ని హైలెట్ చేస్తూ పోస్టర్ డిజైన్ చేశారు. ఈ సిరీస్ మరోసారి మరో బ్లాక్ బస్టర్ ని తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది… ఇక ‘ఫ్యామిలీ మెన్ 3’ సిరీస్ 2019 వ సంవత్సరంలో కరోనా నేపథ్యంలో చైనా ఇండియా మీద ఎలాంటి దాడి చేసింది అనే కథాంశంతో తెరకెక్కబోతుంది.
ఫ్యామిలీ మెన్ మూడు సీజన్స్ లలో మొదటి రెండు సీజన్ లను మినహాయిస్తే ఈ సీజన్ కోసమే చాలా ఎక్కువగా కష్టపడ్డాం అంటూ దర్శకులు రాజ్ అండ్ డీకే లు చెప్పడం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. ఈ లెక్కన ఈ సీజన్ గతంలో వచ్చిన రెండు సీజన్ లను మించి ఉండబోతుంది అనే విషయం అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది…
Also Read: టాప్ లెస్ లుక్ లో తెలుగు నటి.. అంకుల్ తో ప్రేమ కూడా !
ఇక ఏది ఏమైనా కూడా ఈ సీజన్ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందనే విషయం మీద క్లారిటీ ఇవ్వలేదు. కానీ మొత్తానికైతే ఈ సీజన్ వచ్చిన తర్వాత మొదటి రెండు సీజన్స్ ను మర్చిపోయా రేంజ్ లో మాత్రం ఉంటుంది అనే విషయాన్ని మేకర్స్ చాలా స్ట్రాంగ్ గా చెబుతున్నారు.
గతంలో మనోజ్ భాజ్ పాయ్ ఈ సీజన్ గురించి మాట్లాడుతూ ఈ సంవత్సరం నవంబర్లో స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలియజేశాడు. మరి ఈ సీజన్ ఎప్పుడు స్ట్రీమ్ అవుతుంది అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…