F3: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఎఫ్ 3’ చిత్రం ఏప్రిల్ 29న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. రేపు ఫస్ట్ సింగిల్ రిలీజ్‌తో మేకర్స్ తమ మ్యూజికల్ ప్రమోషన్లను స్టార్ట్ చేస్తున్నారు. తాజాగా సినిమాలోని మొదటి సాంగ్ ప్రోమో ‘లబ్ డబ్ లబ్ డబ్బూ’ పాట ప్రోమో విడుదలైంది. ఇక ఇందులో వెంకీ, వరుణ్ తేజ్ యూత్‌ఫుల్ అవతార్‌లో, ఉత్సాహంగా అమ్మాయితో డ్యాన్స్ చేస్తూ ఈ వీడియోలో కనిపించారు.

మొత్తానికి “ఎఫ్ 3” ఫస్ట్ సింగిల్ ప్రోమో అవుట్ ఫుట్ చాలా బాగుంది. ఈ ప్రోమో.. సాంగ్ పైనే కాకుండా సినిమా పై కూడా అంచనాలను రెట్టింపు చేసింది. ఏది ఏమైనా దర్శకుడు అనిల్ రావిపూడికి బాక్సాఫీస్ లెక్కలు బాగా తెలుసు. ఆ లెక్కలకు అనుకూలంగానే ‘ఎఫ్ 3’ స్క్రిప్ట్ లో అదిరిపోయే కామెడీతో పాటు పక్కా మాస్ మసాలా అంశాలు కూడా కథకు అనుగుణంగా పెట్టాడని తెలుస్తోంది.
Also Read: ఏపీ సర్కారు ఉద్యోగుల వేతనాల కోసం పెడుతున్న ఖర్చు ఎంతంటే?
సహజంగా అనిల్ రావిపూడి సినిమాల్లో మంచి హైలైట్ పాయింట్ ఏమిటంటే.. కామెడీ అంతా హీరోల పాత్రల్లో నుండి మాత్రమే పుట్టుకొచ్చేలా పాత్రలను డిజైన్ చేస్తాడు. ఇక ఎఫ్ 3 సినిమాలో హీరోల పాత్రల విషయానికి వస్తే.. రేచీకటి ఉన్న వ్యక్తి పాత్రలో వెంకటేష్ నటిస్తున్నాడు. అలాగే, నత్తితో నానాపాట్లు పడే వ్యక్తి పాత్రలో వరుణ్ తేజ్ కనిపిస్తున్నాడు.

మొత్తమ్మీద వీరి లోపాలు ఫుల్ ఎంటర్ టైన్ చేస్తాయట. అదే విధంగా ఎఫ్ 2లోని వెంకటేష్, వరుణ్ తేజ్‌ల కోబ్రా బంధం కంటిన్యూ అవుతుందని కూడా తెలుస్తోంది. ఎలాగూ ఈ సీక్వెల్ లోనూ తమన్నా, మెహ్రిన్ లు వీరికి భార్యలుగా నటిస్తున్నారు. అన్నట్టు ఈ సినిమా ఫస్ట్ లుక్ లోనే డబ్బులతో నింపిన ట్రాలీలను నెట్టుకెళుతున్న వెంకటేష్, వరుణ్ లను చూపించి.. అనిల్ రావిపూడి కథను చెప్పేశాడు.
ఇక ఈ సినిమా పూర్తిగా డబ్బులు చుట్టూ నడిచే కామెడీ డ్రామా అని ఇన్ డైరెక్ట్ గా స్పష్టం చేశాడు. తమన్నా, మెహ్రిన్ లు… వెంకీ, వరుణ్ లను పెట్టే టార్చర్ వల్లే.. వాళ్ళ జీవితాలు డబ్బులు చుట్టూ తిరుగుతాయట. ఈ సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ లో సోనాలి చౌహాన్ తో పాటు ప్రగ్యా జైస్వాల్, అలాగే అంజలి కూడా నటిస్తున్నారు.
[…] Hrithik Roshan: బాలీవుడ్ హీరోల్లో అందగాడు ఎవరు అంటే.. ముందు వరుసలో చెప్పుకోవాల్సిన హీరో ‘హృతిక్ రోషన్’. అలాంటి హీరో ప్రస్తుతం సోలోగా ఉంటున్నాడు. భార్యతో విడిపోయాక, ‘హృతిక్ రోషన్’ సినిమాల పై ఫోకస్ పెట్టాడు. అయితే, ఆశించిన స్థాయిలో సినిమాలు ఆడలేదు. మధ్యలో కొంత బ్రేక్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. మరి ఈ బ్రేక్ లోనే ‘హృతిక్ రోషన్’కి ఒక చిన్న హీరోయిన్ కనెక్ట్ అయింది. […]