KGF : కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా లెవెల్ లో మంచి క్రేజ్ ని తెచ్చుకున్న హీరో యాష్. కన్నడ లో ఈయన్ని అభిమానులు రాకింగ్ స్టార్ అని పిలుచుకుంటూ ఉంటారు. 2022 వ సంవత్సరం లో కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత ఈయన నుండి ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ‘టాక్సిక్’ అనే పాన్ ఇండియన్ సినిమాని ప్రకటించాడు కానీ, ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్లేందుకు చాలా సమయం పట్టింది. ఎట్టకేలకు రీసెంట్ గానే షూటింగ్ ని మొదలు పెట్టుకున్న ఈ సినిమా మూడు ముఖ్యమైన షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం లో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈమె కన్నడ లో పలు సూపర్ హిట్ సినిమాలు చేసింది కానీ, యాష్ రేంజ్ హీరోలతో ఇప్పటి వరకు ఆమె సినిమాలు చేయలేదు. యాష్ కూడా ఆమె మీద ఎంతో నమ్మకం ఉంచి ఈ సినిమాని చేయడానికి ఒప్పుకున్నాడు.
నెలరోజుల పాటు షూటింగ్ జరిగింది. రీసెంట్ గానే ఈ నెల రోజుల షూటింగ్ కి సంబంధించిన రషెస్ ని చూసి హీరో యాష్ కి కోపం వచ్చిందట. నిన్ను నమ్మి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇస్తే, ఇంత చెత్తగా సినిమా తీస్తావా?, నా సమయాన్ని మొత్తం వృధా చేసావు అంటూ డైరెక్టర్ పై యాష్ ఫైర్ అయ్యాడట. నెల రోజులుగా తీసిన ఈ ఫుటేజీ ని మొత్తం పక్కన పారేయండి, మళ్ళీ ఫ్రెష్ గా రీ షూట్ చేయండి అని ఆదేశించాడట. యాష్ పాన్ ఇండియా లెవెల్ లో పెద్ద సూపర్ స్టార్, ఆయనకీ ఎదురు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి నిర్మాతకి. ఈ నెల రోజుల షూటింగ్ కి గాను ఆయన 35 కోట్ల రూపాయిలు ఖర్చు చేశాడట. ఆ డబ్బులు మొత్తం ఇప్పుడు బూడిద లో పోసిన పన్నీరు అయ్యింది.
KVN ప్రొడక్షన్స్ అతి పెద్ద నిర్మాణ సంస్థ కాబట్టి 35 కోట్ల రూపాయిలు వాళ్లకు ఒక లెక్క కాదు. కానీ మీడియం రేంజ్ నిర్మాతలు ఇలాంటి హై బడ్జెట్ సినిమాలు తీస్తే నాశనం అయిపోతారు. హీరోలు కూడా ఇవన్నీ ఆలోచించాలి. షాట్స్ ఓకే చేసినప్పుడే ఔట్పుట్ ని చూసి, ఇలా కాదు, అలా తీయండి అని చెప్పడానికి ఏమవుతుంది?, అలా చెప్పకుండా 30 శాతం కి పైగా షూటింగ్ ని పూర్తి చేసిన తర్వాత, ఆ ఫుటేజీ మొత్తాన్ని పక్కన పారేయండి అనడం ఎంత వరకు కరెక్ట్?..బెస్ట్ ఔట్పుట్ ఇస్తే మంచి ఫలితం వస్తుంది కదా అని అనుకోవడం లో తప్పు లేదు. కానీ ఇన్ని సినిమాలకు పని చేసిన అనుభవం ఉంది, షాట్ ని వివరించేటప్పుడే ఎదో తేడాగా ఉంది అనేది అర్థం అవ్వాలి కదా?, పెట్టే నిర్మాత ఉన్నాడు కదా అని ఇష్టమొచ్చినట్టు వ్యవహరించడం పద్దతి కాదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.