Sanjana Galrani: కన్నడ బ్యూటీ ‘సంజనా గల్రానీ’ తాజాగా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు వైద్యం చేసిన మహిళా డాక్టర్ ఈ విషయాన్ని పోస్ట్ చేస్తూ.. ‘బాబు పుట్టాడు’ కంగ్రాచ్యులేషన్స్ అని క్యాప్షన్ ను పెట్టింది. పైగా సంజనతో దిగిన ఫోటోను కూడా ఆమె ఈ పోస్ట్ లో యాడ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోహెల్ మీడియాలో వైరల్ గా మారింది.

మొత్తానికి సంజన ఇటు బాబుకు జన్మనిస్తే.. అటు సంజన చెల్లి ‘నిక్కీ గల్రానీ’ పెళ్లి వేడుకల్లో ఫుల్ బిజీగా ఉంది. మే 18న సంజన చెల్లి నిక్కీ గల్రానీ, హీరో ఆది పినిశెట్టిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆది పినిశెట్టి హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ప్లాప్ ల పరంపరలో గత కొన్నేళ్లుగా కొట్టుమిట్టాడుతూ మధ్యలో అడపదడపా ప్రత్యేక పాత్రల్లో రాణిస్తున్నాడు. అయితే, తెలుగు తెర పై నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించాడు.

Also Read: Chinna Jeeyar Swamy- YCP Leaders: కేసీఆర్ కోసమే చినజీయర్ స్వామిని దూరం పెడుతున్న వైసీపీ నేతలు?
ఇక నిక్కీ గల్రాని కూడా చిన్నాచితకా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించడానికి నానా పాట్లు పడింది. అయితే, ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది అనుకోండి. కానీ, ‘ఆది’ని మాత్రం బాగా ఆకట్టుకుంది. ఆదితో చాలా కాలంగా నిక్కీ గల్రాని డేటింగ్ లో ఉండి, మొన్న 18వ తేదీన అతనికి ఇల్లాలు అయ్యింది.

మొత్తమ్మీద ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని పెళ్ళి ఘనంగా జరిగింది. గతంలో ఆది – నిక్కీ కలిసి 2015లో ‘మలుపు’ అనే సినిమాలో కలిసి నటించారు. అప్పటి నుంచి వీరి మధ్య ప్రేమ బంధం కొనసాగుతూ వచ్చింది.
మొత్తానికి ‘సంజనా గల్రానీ’, ‘నిక్కీ గల్రానీ’ నెటిజన్లకు గుడ్ న్యూస్ చెప్పారు. ఒకరు ఇల్లాలు అయితే, మరొకరు తల్లి అయ్యారు. అందుకే, ప్రస్తుతం ఈ అక్కాచెల్లెళ్లు ఇద్దరికి ఫ్యాన్స్ శుభాకాంక్షలు చెప్పడానికి పోటీ పడుతున్నారు.
Also Read: Jagan KTR: రహస్య చర్చలకే కేటీఆర్, జగన్ దావోస్ వెళుతున్నారా?


