Directors: 2021లో తొలి చిత్రంతోనే హిట్టందుకున్న దర్శకులు వీళ్లే..!

Directors: 2021 సంవత్సరం టాలీవుడ్ కు మిక్స్ డ్ ఫీలింగ్ అందించింది. 2020లో కరోనా ఎంట్రీ ఇచ్చాక థియేటర్లన్నీ మూతపడ్డాయి. దీంతో చిన్న సినిమాలు ఓటీటీ బాటపట్టాయి. ప్రేక్షకులు సైతం ఓటీటీలో సినిమాలను చూసేందుకు అలవాటుపడిపోయారు. ఆ తర్వాత 2021లో కరోనా కేసులు కొంచెం తగ్గుముఖం పట్టడంతో థియేటర్లు మళ్లీ ఓపెన్ అయ్యాయి. అయితే పరిస్థితులు మాత్రం సాధారణ స్థితికి రాలేదు. ఇలాంటి  పరిస్థితుల్లోనే కొత్త దర్శకుడు తమ సినిమాలతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విజయవంతమయ్యారు. ఇలాంటి […]

Written By: NARESH, Updated On : December 27, 2021 4:11 pm
Follow us on

Directors: 2021 సంవత్సరం టాలీవుడ్ కు మిక్స్ డ్ ఫీలింగ్ అందించింది. 2020లో కరోనా ఎంట్రీ ఇచ్చాక థియేటర్లన్నీ మూతపడ్డాయి. దీంతో చిన్న సినిమాలు ఓటీటీ బాటపట్టాయి. ప్రేక్షకులు సైతం ఓటీటీలో సినిమాలను చూసేందుకు అలవాటుపడిపోయారు. ఆ తర్వాత 2021లో కరోనా కేసులు కొంచెం తగ్గుముఖం పట్టడంతో థియేటర్లు మళ్లీ ఓపెన్ అయ్యాయి. అయితే పరిస్థితులు మాత్రం సాధారణ స్థితికి రాలేదు. ఇలాంటి  పరిస్థితుల్లోనే కొత్త దర్శకుడు తమ సినిమాలతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విజయవంతమయ్యారు.

Tollywood Directors

ఇలాంటి సమయంలోనూ టాలీవుడ్ నుంచి కొత్త టాలెంట్ బయటికి వచ్చి పరిశ్రమకు కొత్త బూస్ట్ ను ఇచ్చింది. ప్రతీ ఏడాదిలాగే 2021లో కొత్త దర్శకులు టాలీవుడ్ కు పరిచయం కాగా కొందరు తొలి సినిమాతోనే డైరెక్టర్ గా ఫ్రూవ్ చేసుకున్నారు. ఈ ఏడాది టాలీవుడ్ కు మెరికల్లాంటి దర్శకులు పరిచయంకాగా పలువురు దర్శకులు తొలి మూవీతోనే ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి సత్తా చాటారు.

వీరిలో ముందుగా చెప్పుకోవాల్సింది మాత్రం డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబే. 2021 ఏడాదిలో బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘ఉప్పెన’ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తొలి సినిమాతోనే ఎంతో అనుభవం కలిగిన దర్శకుడిగా బుచ్చిబాబు ‘ఉప్పెన’ను తెరకెక్కించాడు. సూపర్ లవ్ స్టోరీని వెండితెరకు పరిచయం చేసి గురువు తగ్గ శిష్యుడిగా బుచ్చిబాబు గుర్తింపు తెచ్చుకున్నాడు.

‘ఉప్పెన’ మూవీ సక్సస్ తో బుచ్చిబాబు టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్ లిస్టులో చేరిపోయాయి. ఇతడితో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు ఆసక్తి చూపుతున్నారు. కాగా బుచ్చిబాబు మాత్రం తన తొలి సినిమాను నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ తోనే నెక్ట్ మూవీ చేయనున్నాడని టాక్ విన్పిస్తోంది. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి.

ఆ తర్వాత దర్శకుడు అనుదీప్ గురించి చెప్పుకోవాలి. ‘జాతిరత్నాలు’ మూవీని తెరకెక్కించి టాలీవుడ్ కు మరో హిట్ ను అందించాడు. ‘జాతిరత్నాలు’ సినిమాలను కామెడీరత్నంగా మలిచిన తీరుకు అతడిపై ప్రశంసలు వెల్లువెత్తాయి. త్వరలోనే విక్టరీ వెంకటేష్ తో ఓ సినిమా, తమిళంలో శివ కార్తికేయ‌న్ తో ఓ సినిమాను చేయబోతున్నాడు.

అల్లరి నరేష్ ‘నాంది’తో టాలీవుడ్ కు ఒక కొత్త దర్శకుడు పరిచయం అయ్యాడు. విజయ్‌ కనకమేడల తన తొలి సినిమాతోనే న్యాయ శాస్త్రంలోని ‘211సెక్షన్‌’ తో లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ ని తీసుకొచ్చి మంచి ప్రసంశలను దక్కించుకున్నాడు. సీరియస్ ఫిల్మ్ మేకర్ అనే పేరు తెచ్చుకున్నాడు. నాంది సినిమా ‘అల్లరి నరేష్’కు మంచి విజయాన్ని అందించింది.

Also Read: సినిమాల పై మోజు.. మరి దర్శకుడు అయ్యేది ఎలా ?

‘రాజ రాజ చోర’తో హసిత్‌ గోలి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఇతడు ప్రామెసింగ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తక్కువ బడ్జెట్లో మంచి సినిమాలు తీయగల దర్శకుల జాబితాలో చేరిపోయాడు. ఈ ఏడాది ఓ మహిళా దర్శకురాలు టాలీవుడ్ కు పరిచయమైంది. ‘వరుడు కావలెను’తో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా నిరూపించుకుంది. సితార బ్యానర్ లో వచ్చిన ఈ మూవీ మంచి హిట్ అందుకుంది.

ఓటీటీల్లోనూ పలువురు దర్శకులు కొత్త సినిమాలతో సత్తాచాటారు. నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ‘సినిమా బండి’తో ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకుడిగా పరిచయం అయ్యాడు. చిన్న కాన్సెప్ట్ తో వచ్చిన వచ్చిన ‘సినిమాబండి’ సినిమా లవర్స్ కు తెగ నచ్చింది. అలాగే ‘ఏక్‌ మినీ కథ’తో కార్తిక్‌ రాప్రోలు దర్శకుడిగా పరిచయమయ్యాడు. అమోజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమాని వెబ్ ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ లభించింది.

Also Read: సీక్రెట్‌గా పెండ్లి చేసుకున్న సెల‌బ్రిటీలు ఎంద‌రో తెలుసా…?