AP Govt: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. దీంతో ప్రభుత్వ నిర్వహణ కష్టంగా మారుతోంది. అయినా అప్పులు మాత్రం దొరకడం లేదు. ఇక ఏం చేయాలనేదానిపై తర్జనభర్జన పడుతోంది. అప్పులు పుట్టించేందుకు నానా తిప్పలు పడుతున్నారు. ఢిల్లీ వేదికగా కేంద్రాన్ని ఒప్పించి అప్పులు తెచ్చుకునేందుకు పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఆర్థికంగా కష్టాలు పడుతోంది. నిధుల రాకడ లేకపోవడంతో అప్పులపైనే ఆధార పడుతోంది. నెలనెల అప్పులు తీసుకోవడంతోనే సరిపోతోంది. దీంతో పూట గడవని పరిస్థితి నెలకొంటోంది. ఈ నేపథ్యంలో అప్పులు తీసుకోవడానికి నేలంతా ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడానికే నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
దీంతో ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతోంది. నిధులు లేక నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోంది. అభివృద్ధి పనుల ఊసే కనిపించడం లేదు. దీంతో ప్రభుత్వం అష్టకష్టాలు పడుతోంది. నెలనెల జీతాల చెల్లింపుకే ప్రయాసలు పడుతోంది. అయినా ఏదో ఒక పని చేస్తూ చివరికి అప్పులు తీసుకొస్తూ నెట్టుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ తీరు అధ్వానంగా మారుతోందని తెలుస్తోంది.
Also Read: Survey Report: సర్వే రిపోర్టు.. పుంజుకున్న టీడీపీ కానీ.. వైసీపీ గెలుస్తుందా అంటే?
వచ్చే నెల జీతాలు చెల్లించాలన్నా, వడ్డీలు ముట్టజెప్పాలన్నా నిధులు మాత్రం అందుబాటులో ఉండడం లేదు. దీంతో నిదుల కోసం నానా తంటాలు పడుతున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా అందక ఎదురుచూపులే మిగులుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీకి గట్టెక్కే మార్గాలు కనిపించడం లేదు. వచ్చే నెల గడిచేదెలా అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.