Mahesh-Sudheer Babu: టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఇంద్రగంటి మోహన కృష్ణకు పేరుంది. అయితే ఈ ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడికి రావాల్సినంత గుర్తింపు అయితే రాలేదని కొందరి నమ్మకం. దర్శకుడిగా ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ విజయాలు సాధించినప్పుడే దానికి విలువ. లేకపోతే గాలిలో కలిసిపోవలసిందే. బిగినింగ్ నుండి ఒడిదుడుకులతో ఇంద్రగంటి కెరీర్ సాగుతుంది. ఒక హిట్ కొడితే వరుసగా రెండు మూడు ప్లాప్స్ ఆయనకు ఎదురవుతూ ఉంటాయి. దీంతో స్టార్ డైరెక్టర్ హోదాకు ఆమడ దూరంలో ఉండిపోతున్నారు.

గ్రహణం వంటి ప్రయోగాత్మక చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఇంద్రగంటికి మొదటి హిట్ అష్టా చెమ్మా మూవీతో దక్కింది. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన అష్టా చెమ్మా ఆయనకు బ్రేక్ ఇచ్చింది. ప్రేక్షకుల మన్ననలతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఆ చిత్రం ఇంద్రగంటి కెరీర్ కి పునాది వేసింది. ‘అంతకు ముందు ఆ తర్వాత’, జెంటిల్ మాన్ చిత్రాలు విజయం సాధించగా ఇంద్రగంటి స్టార్ డైరెక్టర్ కావడం ఖాయం అనుకున్నారు. అయితే ఆయన ఎన్నో ఆశలతో తెరకెక్కించిన మల్టీస్టారర్ ‘వి’ నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.
నాని-సుధీర్ బాబు హీరోలుగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘వి’ అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన విషయం తెలిసిందే. సినిమాలో విషయం లేదని ఆర్డినరీ సినిమా అంటూ నెగిటివ్ రివ్యూస్ రావడంతో ఇంద్రగంటి కెరీర్ మళ్ళీ మొదటికి చేరింది. అయితే ఎలాగైనా ఓ స్టార్ హీరోతో మూవీ చేసి స్టార్ డైరెక్టర్ కావాలనుకుంటున్న ఇంద్రగంటి.. దాని కోసం ప్రయత్నాలు అయితే ఆపడం లేదట. ముఖ్యంగా మహేష్ ని ఒప్పించి, సినిమా చేయాలనేది ఆయన టార్గెట్ గా ఉందట.
Also Read: మహేష్ కోసం త్రివిక్రమ్ ‘హెలికాప్టర్ల ఫైట్’ !
దానితో హీరో సుధీర్ బాబును కాకా పడుతున్నాడట. సుధీర్ గొప్ప నటుడంటూ పొగిడేస్తూ.. సుధీర్ వద్ద మరిన్ని మార్కులు కొట్టేయాలని చూస్తున్నారట. సుధీర్ చొరవతో మహేష్ కి కథ వినిపించే ఛాన్స్ దక్కించుకోవాలని అనుకుంటున్నారట. స్క్రిప్ట్ నచ్చితే మహేష్ స్టార్ డమ్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తారు. ఈ విషయం బాగా తెలిసిన ఇంద్రగంటి అవసరం ఉన్నా లేకుండా సుధీర్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నాడని సమాచారం.
అలాగే ఇంద్రగంటి-సుధీర్ మధ్య స్ట్రాంగ్ బాండింగ్ ఉంది. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో సమ్మోహనం, ‘వి’ చిత్రాలు తెరకెక్కాయి. హ్యాట్రిక్ మూవీ ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ షూటింగ్ జరుపుకుంటుంది. ఒకరిపై ఒకరికి మంచి అభిమానం, నమ్మకం కూడా ఉన్నాయి. మరి వీరి స్నేహం మహేష్ తో ఇంద్రగంటి మూవీ చేసేలా చేస్తుందో లేదో చూడాలి. టాలీవుడ్ స్టార్స్ అందరూ పాన్ ఇండియా చిత్రాలంటూ పెద్ద పెద్ద డైరెక్టర్స్ ని ఎంచుకుంటున్నారు. మహేష్ ఇంద్రగంటి లాంటి ఫార్మ్ లో లేని డైరెక్టర్ కి ఛాన్స్ ఇవ్వడం అంత సులభం కాదు
Also Read: సింపుల్ హీరో.. కానీ నిజమైన హీరో !