https://oktelugu.com/

Heroine: ఆ డెరెక్టర్ వైవాహిక జీవితంలో చిచ్చుపెట్టిన ప్రముఖ హీరోయిన్..!

Heroine Amala Paul: సౌత్ ఇండియాలోని మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్లలో అమలాపాల్ ఒకరు. తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్ గా అమలాపాల్ గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్లో మెగా పవర్ స్టార్ రాంచరణ్, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, నాగచైతన్య తదితర హీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అలాగే తమిళంలో హీరో ధనుష్, విజయ్, మోహన్ లాల్ వంటి టాప్ హీరోల పక్కన వరుసగా నటిస్తూ అక్కడ స్టార్డమ్ సొంతం చేసుకుంది. అమలాపాల్ సినిమా కెరీర్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 6, 2022 / 02:05 PM IST
    Follow us on

    Heroine Amala Paul: సౌత్ ఇండియాలోని మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్లలో అమలాపాల్ ఒకరు. తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్ గా అమలాపాల్ గుర్తింపు తెచ్చుకుంది. టాలీవుడ్లో మెగా పవర్ స్టార్ రాంచరణ్, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, నాగచైతన్య తదితర హీరోల సరసన నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అలాగే తమిళంలో హీరో ధనుష్, విజయ్, మోహన్ లాల్ వంటి టాప్ హీరోల పక్కన వరుసగా నటిస్తూ అక్కడ స్టార్డమ్ సొంతం చేసుకుంది.

    అమలాపాల్ సినిమా కెరీర్ పిక్స్ లో ఉండగానే కోలీవుడ్ కు చెందిన ఓ యువ దర్శకుడిని వివాహం చేసుకుంది. అయితే కొన్నినెలలకే ఆ బంధానికి ఎండ్ కార్డు పడింది. దీంతో ఆమె తిరిగి సినిమాలపై పూర్తి ఫోకస్ పెడుతోంది. విడాకుల తర్వాత అమలాపాల్ గ్లామర్ డోస్ పెంచడంతో ఆమెకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి. ఈక్రమంలోనే ఆమె ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీసుల్లో నటిస్తూ తీరిక లేకుండా గడుపుతోంది.

    హీరోయిన్ అమలాపాల్ తాజాగా హిందీలో ‘రంజిష్ హీ సహీ’ అనే వెబ్ సిరీసులో నటిస్తోంది. ఈ వెబ్ సిరీసు నేటి నుంచి వూట్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ‘రంజిష్ హీ సహీ’ వెబ్ సిరీసు ట్రైలర్ రిలీజైనప్పటి నుంచే ఈ వెబ్ సిరీసు కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇందులో అమలాపాల్ బోల్డ్ గా నటించినట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది.

    కాగా ‘రంజిష్ హీ సహీ’ వెబ్ సిరీసును ప్రముఖ బాలీవుడ్ దర్శక, నిర్మాత మహేష్ భట్ జీవితాధారంగా తెరకెక్కింది. మహేష్ భట్ పాత్రలో నటుడు తాహిర్ నటిస్తుండగా పుష్పదీప్ దర్శకత్వం వహిస్తున్నాడు. సాఫీగా సాగిపోతున్న దర్శకుడి జీవితంలోకి ఓ సింగర్ పాత్ర ఎంట్రీ ఇస్తోంది. మద్యం, సిగరెట్, పాశ్చత్య సంస్కృతికి అలవాటుపడిన ఆ సింగర్ పాత్రలో అమలాపాల్ కన్పించనుంది.

    ఆమె ఎంట్రీతో ఆ దర్శకుడి వివాహ బంధంలో ఎలాంటి అనుహ్య సంఘటనలు చోటుచేసుకున్నాయనేది స్టోరీగా తెలుస్తోంది. ఈ హిందీ వెబ్ సిరీసు విడుదలయ్యాక తనకు బాలీవుడ్లో మరింత గుర్తింపు రావడం ఖాయమని అమలాపాల్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. మరీ ఈ అమ్మడి కష్టం ఫలిస్తుందో లేదో వేచిచూడాల్సిందే..!