Krithi Shetty: ఈ మధ్య కాలం లో ఇండస్ట్రీ కి పరిచయమైనా యంగ్ హీరోయిన్స్ లో యూత్ ని విశేషంగా ఆకర్షించిన బ్యూటీ కృతి శెట్టి..సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరో గా ఇండస్ట్రీ కి పరిచయమైనా ‘ఉప్పెన’ సినిమాతోనే ఈమె కూడా తెలుగు తెరకి పరిచయం అయ్యింది..ఆ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..సుమారు 60 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది ఆ చిత్రం.

తొలి సినిమాతోనే అంత పెద్ద బంపర్ హిట్ దక్కించుకున్న ఈ బ్యూటీ కి అవకాశాలు వెల్లువ లాగ కురిసాయి..వచ్చిన సినిమాలన్నిటికీ సంతకాలు చేసేసింది..వాటిల్లో శ్యామ్ సింగ రాయ్ చిత్రం ఒక్కటే సూపర్ హిట్ గా నిలిచింది..ఈ ఏడాది ఆమె హీరోయిన్ గా నటించిన ‘మాచెర్ల నియోజకవర్గం’, ‘ది వారియర్’ మరియు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ వంటి సినిమాలు డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి.
దీనితో ఈ హీరోయిన్ కెరీర్ రిస్క్ లో పడింది..ఇక ఆ తర్వాత నుండి ఈమె తర్వాత చెయ్యబొయ్యే సినిమాల విషయం లో ఆచి తూచి అడుగులేస్తోంది..తమిళ స్టార్ హీరో సూర్య – బాల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది కృతి శెట్టి..కానీ ఈ సినిమా కొన్ని కారణాల వల్ల అట్టకెక్కింది..ఈ చిత్రం తర్వాత ఆమెకి బాలీవడ్ లో ఒక క్రేజీ ఆఫర్ వచ్చింది..’అంధాదున్’ వంటి సూపర్ హిట్ సినిమాని తెరకెక్కించిన శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం లో ఒక సినిమాలో నటించడానికి ఒప్పుకుంది కృతి శెట్టి.

అడ్వాన్స్ కూడా తీసుకుంది..కానీ షూటింగ్ లోకి వెళ్లేముందు ఆడిషన్స్ లో పాల్గొనాల్సిందిగా డైరెక్టర్ ఆదేశించాడట..అందుకు కృతి శెట్టి ఈగో హార్ట్ అయ్యింది..కొత్త హీరోయిన్ లాగ నాకేంటి ఈ ఆడిషన్స్..నేను రాను..ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నాను అంటూ డైరెక్టర్ కి మొహం మీదనే నేరుగా చెప్పేసి..తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగి పంపేసిందట..ఈ వార్త ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.