Aha Media: ఆహా మీడియా లో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ సీజన్ 2 టాక్ షో విజయవంతంగా ముందుకు దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే..ఈ సీజన్ లో ఇది వరకు ఎంతో మంది సెలబ్రిటీస్ హాజరైనప్పటికీ డిసెంబర్ 30 వ తారీఖున ప్రసారం అవ్వబోతున్న ప్రభాస్ ఎపిసోడ్ కోసం మిగిలిన అన్నీ ఎపిసోడ్స్ కంటే అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఈ ఎపిసోడ్ తర్వాత చివరి ఎపిసోడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉండబోతుంది..దీనికి సంబంధించిన పరోక్ష ప్రకటన ఇదివరకే చేసింది ఆహా మీడియా..త్వరలోనే అధికారిక ప్రకటన కూడా చెయ్యబోతున్నారు..ఈ నెల 27 వ తారీఖున ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ ఉంటుందని సోషల్ మీడియా లో గత కొద్దీ రోజులుగా ప్రచారం లో ఉంది..అయితే ఇప్పుడు ట్విట్టర్ లో ఆహా మీడియా పెట్టిన ఒక ట్వీట్ ఫ్యాన్స్ ని కాస్త టెన్షన్ పెడుతోంది.
‘వీ ఆర్ సారి మావా బ్రోస్..అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాము’ అంటూ ఒక ట్వీట్ వేశారు..ఈ ట్వీట్ కి అటు ప్రభాస్ ఫ్యాన్స్ ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కంగారు పడిపోయారు..ప్రభాస్ ఫ్యాన్స్ ‘ఏమైంది రా..మళ్ళీ ఎపిసోడ్ ని పోస్ట్ పోనే చేస్తున్నావా’ అని అడగగా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ‘మా హీరో ఎపిసోడ్ క్యాన్సిల్ అయ్యిందా’ అని అని కామెంట్ బాక్స్ మొత్తం ఈ ఇరువురి హీరోల అభిమానులు కామెంట్స్ తో నింపేశారు.

పవన్ కళ్యాణ్ మొన్న వీర సింహ రెడ్డి సెట్స్ కి వెళ్లి బాలయ్య బాబు ని కలిసింది ‘అన్ స్టాపబుల్’ షో కి రావట్లేదని మర్యాదపూర్వకంగా చెప్పడానికే వెళ్లాడా..షో కి రాలేకపోతున్నందుకే ‘వీర సింహా రెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడా..ఇలాంటి సందేహాలెన్నో అభిమానులను వెంటాడాయి..మరి దీనికి ఆహా మీడియా ఎలాంటి క్లారిటీ ఇస్తుందో చూడాలి.