China Covid Wave: చైనా.. అదొక ఉక్కు పిడికిలి లాంటి దేశం.. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ ఓ పట్టాన అంతు పట్టదు. అక్కడ ఏం జరిగినా విషయం బయటపడదు. ఆసక్తి కొద్దీ తెలుసుకుందామన్నా ఓ పట్టానా సమాచారం దొరకదు. వాస్తవాల కంటే వదంతులే ఎక్కువగా వినిపిస్తాయి. ఈ నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న కొంతమంది తెలుగువారు అక్కడి పరిస్థితులను మాతో పంచుకున్నారు.
కరాళ నృత్యం
కోవిడ్ పుట్టినిల్లు చైనాలో ఇప్పుడు ఆ వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రకారం ఓమిక్రాన్ కొత్త వేరియంట్ బీ ఎఫ్. 7 కల్లోలం సృష్టిస్తున్నది. జీరో కోవిడ్ పాలసీ కి ముగింపు పలికిన చైనాలో గత పది రోజులుగా కేసులు దారుణంగా నమోదవుతున్నాయి.. వైద్య సేవలకు సిబ్బంది కూడా కరువయ్యారంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందా అర్థం చేసుకోవచ్చు. కేసుల తీవ్రత కనివినీ ఎరుగని స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కోవిడ్ నిర్ధారణ పరీక్షలను నిలిపివేసింది.. రోజువారీ కేసుల వెల్లడి కూడా బంద్ పెట్టింది. అంతేకాదు మెజారిటీ కుటుంబాల్లో అందరూ కోవిడ్ బారిన పడ్డారు.. ముఖ్యంగా మహిళలు గొంతు ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నారు. వృద్ధులు మరణ శయ్యపై ఉన్నారు.. వీరిలో 25 శాతం మంది కి ప్రాణాపాయం ఉంది. కోవిడ్ పాజిటివ్ గా తేలిన వారు ఆసుపత్రిలో చేరేందుకు మూడు గంటల దాకా నిరీక్షించాల్సి వస్తోంది.. ప్రభుత్వం జీరో కోవిడ్ పాలసీని ఎత్తివేసినప్పటికీ రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. మరోవైపు కోవిడ్ ఉన్నప్పటికీ అక్కడి ప్రభుత్వం విధుల్లోకి రమ్మని ఉద్యోగులను ఆహ్వానిస్తున్నది.
రాజధాని లో 80 శాతం పైనే
చైనా రాజధాని బీజింగ్ లో 80 శాతం పైగా ప్రజలు కోవిడ్ కు గురయ్యారు. బీజింగ్ సహా ప్రధాన నగరంలోని ఆసుపత్రులు కోవిడ్ రోగుల తాకిడిని తట్టుకోలేకపోతున్నాయి.. బీజింగ్ లోని ఒక ఆసుపత్రికి రోజుకు 500 పైగా సీరియస్ కేసులు వస్తున్నాయి. దీంతో తాత్కాలిక ఇన్సెంటివ్ కేర్ యూనిట్లు, పడకల పెంపును ప్రభుత్వం చేపడుతోంది. ప్రజలు సంప్రదాయ వైద్యాన్ని నమ్ముతున్నారు. ఫ్యాక్టరీలు, కంపెనీలు నడుస్తున్నప్పటికీ వాటిల్లో కార్మికుల హాజరు 10 శాతానికి మించడం లేదు. ఇక గత వారం వరకు 99 శాతం మంది ఇళ్ళకే పరిమితమయ్యారు. ఇక మొన్నటి వరకు జీరో కోవిడ్ పాలసీ అమలు చేసిన చైనా ఇప్పుడు దానిని ఎత్తేసింది. గతంలో పాజిటివ్ కేసులు వస్తే ఐసోలేషన్లో ఉంచిన ప్రభుత్వం… ఇప్పుడు పాజిటివ్ ఉన్నప్పటికీ విధులకు రమ్మని ఆహ్వానిస్తున్నది. అంతేకాదు వివిధ రాష్ట్రాల మధ్య ఆంక్షలను కూడా పూర్తిగా సడలించింది.. అన్నింటికంటే ముఖ్యంగా విదేశాల నుంచి వస్తే పది రోజుల క్వారంటైన్ ను పూర్తిగా ఎత్తేసింది.. ప్రజలే స్వచ్ఛందంగా క్వారంటైన్ అవుతున్నారు.. ఇక రోగుల తాకిడి పెరగడంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యేందుకు గంటలపాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది.
కండిషన్ సీరియస్ గా ఉన్న వారినే..
ఆస్పత్రుల్లో కూడా కండిషన్ సీరియస్ గా ఉన్న వారినే అడ్మిట్ చేసుకుంటున్నారు. ఇక చైనాలో మందులు కావాలంటే మనలాగా బయటకు వెళ్లి తెచ్చుకోవడం ఉండదు. అంత ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉంటాయి.. కొన్ని మందులు మాత్రమే దుకాణాల్లో విక్రయిస్తారు.. కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో పారాసిటమల్ వంటి మాత్రలను ప్రజలు పెద్ద ఎత్తున తీసుకెళ్లి ఇంట్లో నిల్వ చేసుకున్నారు.. దీంతో ఆ మాత్రలకు కొరత ఏర్పడింది.. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా వచ్చేందుకు చాలా సమయం పడుతున్నది. ఇలా చెప్పుకుంటూ పోతే చైనాలో కోవిడ్ కు అంతూ పొంతూ లేదు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: China to stop publishing daily covid cases amid latest surge
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com