Srimanthudu Case: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ప్రతి ఒక్కరికి అమితమైన ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ఆయన చేసిన ప్రతి సినిమా ప్రేక్షకులను మెప్పించడంతో పాటుగా, ప్రతి ప్రేక్షకుడి కుటుంబంలో తను ఒక మెంబర్ గా మారిపోయాడు. అందుకే మహేష్ బాబు అంటే ఎవరికి వాళ్లు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ గా భావిస్తూ ఆయన సినిమాని మొదటి రోజే చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమం లోనే మహేష్ బాబు సినిమాకు సంబంధించిన ఒక వివాదం ఇప్పటివరకు నడుస్తూనే ఉంది. అది ఏంటి అంటే 2015 వ సంవత్సరంలో మహేష్ బాబు హీరోగా ‘శ్రీమంతుడు ‘ అనే సినిమా చేశాడు, ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది.
అయితే ఇండస్ట్రీలో ఒక సినిమా వచ్చింది అంటే ఆ సినిమా స్టోరీ నాది అంటూ చాలా మంది మీడియా వేదికగా రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు. ఇక ఈ సినిమా విషయంలో కూడా అలానే జరుగుతుంది. ఇక నవల రచయిత అయిన శరత్ చంద్ర తను రాసుకున్న ‘చచ్చేంత ప్రేమ’ అనే నవలను కొరటాల శివ కాపీ చేసి శ్రీమంతుడు అనే సినిమాని తీశాడు, అంటూ కొరటాల శివ మీద 2015 వ సంవత్సరంలోనే ఆయన నాంపల్లి కోర్టులో కేసు వేశారు. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ కోర్టులో ఈ కేసు నడుస్తూనే ఉంది. ఇక దాంతో కొరటాల శివ కూడా అప్పుడే తెలంగాణ హైకోర్టులో ఈ కేసుకు సంబంధించిన పిటిషన్ ని దాఖలు చేశాడు.
అయితే కొరటాల శివకి అక్కడ చుక్కెదురైంది. దాంతో సుప్రీంకోర్టుని ఆశ్రయించగా, అక్కడ కూడా ఆయన కి ఏ మాత్రం ఫేవర్ గా కనిపించడం లేదు.
ఇక ఇది ఇలా ఉంటే ఈ విషయం మీద ఆ మూవీ ప్రొడ్యూసర్స్ స్పందిస్తూ శ్రీమంతుడు సినిమా, చచ్చేంత ప్రేమ నవల రెండూ కూడా పబ్లిక్ డొమైన్ లోనే ఉన్నాయి. కాబట్టి ఆ రెండు ఒకదానితో ఒకటి సంబంధం లేని స్టోరీలు కావాలంటే ఒకసారి పబ్లిక్ కూడా వాటిని చూసి వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు.
ఇంకా ఎవరిది తప్పు , ఎవరిది కరెక్ట్ అని కోర్టు తీర్పు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడే మీడియా వాళ్ళు ఎలాంటి కథనాలను రాయవద్దంటూ వాళ్లు మర్యాదపూర్వకంగా మీడియా కి తెలియజేశారు…ఇక ఇది ఇలా ఉంటే కొరటాల ఈ స్టోరీ ని కాపీ చేశాడు అని తేలుతుందా..? లేదా రెండు స్టోరీలు దేనికి అవే సపరేట్ గా ఉన్నాయని కోర్టు తీర్పిస్తుందా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…