Homeఎంటర్టైన్మెంట్Pushpa 2: పుష్ప 2 షూటింగ్: టెన్షన్ లో సుకుమార్, బన్నీ... అంతా హడావుడిగా!

Pushpa 2: పుష్ప 2 షూటింగ్: టెన్షన్ లో సుకుమార్, బన్నీ… అంతా హడావుడిగా!

Pushpa 2: పుష్ప 2 కోసం దేశవ్యాప్తంగా సినిమా లవర్స్ ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఈ చిత్రం పై ఉన్న హైప్ అంతా ఇంతా కాదు. బాలీవుడ్ చిత్రాలను కూడా వెనక్కి నెట్టి మోస్ట్ అవైటెడ్ జాబితాలో టాప్ లో పుష్ప 2 లో నిలిచింది. దాదాపు రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 విడుదల తేదీ ప్రకటించారు. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.

అయితే పుష్ప 2 షూటింగ్ అనుకున్న ప్రకారం జరగలేదు. అనుకోని అవాంతరాలు ఎదురయ్యాయి. దీంతో పుష్ప 2 షూటింగ్ చాలా వరకు పూర్తి చేయాల్సి ఉందట. నిజానికి ఏప్రిల్ కల్లా చిత్రీకరణ పార్ట్ పూర్తి చేసి… ప్రశాంతంగా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుందామని భావించారు. ఏప్రిల్ కి పుష్ప 2 చిత్రీకరణ పూర్తి అయ్యే అవకాశమే లేదట. పుష్ప 2లో అల్లు అర్జున్ అసిస్టెంట్ రోల్ చేసిన జగదీష్ ప్రతాప్ ఓ అమ్మాయి ఆత్మహత్య కేసులో జైలుపాలు అయ్యాడు.

ఇటీవలే జైలు నుండి విడుదలై షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. జగదీష్ మీద భారీ ఎపిసోడ్స్ ఉన్నట్లు సమాచారం. ఇది ఒకింత మైనస్ అయ్యింది. ఈ క్రమంలో పుష్ప 2 విడుదల వాయిదా అంటూ కథనాలు వెలువడ్డాయి. అయితే మేకర్స్ ఈ పుకార్లను కొట్టిపారేశారు. చెప్పినట్లే ఆగస్టు 15న పుష్ప 2 విడుదల అవుతుందని వెల్లడించారు. కానీ ఆ తేదీకి రావాలంటే సుకుమార్-అల్లు అర్జున్ నిర్విరామంగా పనిచేయాలి.

ప్రతి రోజు, ప్రతి గంట వృధా చేయకుండా షూటింగ్ చేస్తే కానీ మే నెలకు పూర్తి అవుతుందట. మిగిలిన రెండు నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి విడుదల చేయాలి. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ హడావుడిగా, ఉరుకుల పరుగుల మీద నడుస్తుందట. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందుతుంది. మరి చెప్పిన ప్రకారం పుష్ప 2 ఇండిపెండెన్స్ డే నాడు థియేటర్స్ లోకి వస్తుందో లేదో చూడాలి.

RELATED ARTICLES

Most Popular