Actress : సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ కెరియర్ చాలా తొందరగా ముగిసిపోతుంది. ఎందుకంటే హీరోలకు ఉన్నంత ఫాలోయింగ్ గాని, క్రేజ్ గాని హీరోయిన్లకు ఉండదు. అందువల్లే వాళ్ళు ఎంత తొందరగా సక్సెస్ అవుతారో అంతే తొందరగా ఫేడ్ అవుట్ అవుతూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీకి వచ్చిన కొంతమంది హీరోలు మాత్రం చాలా సంవత్సరాల పాటు వాళ్ళ టాలెంట్ తో వరుసగా సినిమాలను చేస్తూ మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో ఎక్కువ సంవత్సరాల పాటు కొనసాగుతూ ఉంటారు.
అయితే ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన ఒక హీరోయిన్ చిన్నప్పటి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఆ హీరోయిన్ ఎవరు అంటే రామ్ పోతినేని హీరోగా, కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన నేను శైలజా సినిమాతో తెలుగు తెర కి పరిచయమైన కీర్తి సురేష్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ అమ్మడు తన నటనతో మంచి గుర్తింపు పొందింది.
ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా వచ్చిన ‘మహానటి’ సినిమాలో సావిత్రి గారి పాత్రను పోషించి ఉత్తమ నటిగా ‘నేషనల్ అవార్డు’ ని కూడా అందుకుంది. ఇక ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో స్టార్ హీరోలందరితో వరుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపును కూడా పొందింది. అయితే ఇప్పటికి కూడా ఆమె అటు స్టార్ హీరోలను, ఇటు యంగ్ హీరోలను కవర్ చేస్తూ మంచి సినిమాలు చేస్తూ వస్తుంది.
ఇక ఈ పైన ఉన్న ఫోటోల్లో కీర్తి సురేష్ తో పాటు తన పక్కన ఉన్న ఆ చిన్నారి ఎవరంటే కీర్తి సురేష్ సోదరి అయిన రేవతి..ఈమె కూడా తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేసి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం కీర్తి సురేష్ కూడా తెలుగు, తమిళ్ అనే తేడా లేకుండా అన్ని భాషల సినిమాలను చేస్తూ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కంటిన్యూ అవుతుంది…