Chiranjeevi new movie: ఒక సినిమా ప్రభావం మరో సినిమా పై పడడం కొత్తేమి కాదు. ఇప్పుడు తమిళం లో విడుదల అవ్వాల్సిన ‘జన నాయగన్'(Jana Nayagan) చిత్రం నిర్మాతలు ఎదురుకుంటున్న ఇబ్బందులు హిస్టరీ లో ఇప్పటి వరకు ఏ నిర్మాత ఎదురుకోలేదు. ఎంతో కష్టపడి నిర్మించిన ‘జన నాయగన్ ‘ చిత్రానికి సెన్సార్ సభ్యులు సర్టిఫికేట్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. కోర్టులో కేసు నడుస్తోంది. ఇప్పట్లో క్లీన్ చిట్ వచ్చే సూచనలే కనిపించడం లేదు. సినిమా విడుదల కాకపోవడం ఫైనాన్షియర్స్ దగ్గర నుండి, బయ్యర్స్ వరకు నిర్మాతపై తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇదే నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), డైరెక్టర్ బాబీ(Bobby Kolli) కాంబినేషన్ లో ఒక సినిమా చెయ్యాలని అనుకున్నారు. ఇప్పుడు ఆర్ధిక ఇబ్బందులు కారణంగా ఈ సినిమా నుండి వాళ్ళు తప్పుకునే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
దీంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని చిరంజీవి తనయురాలు సుష్మిత కొణిదెల మరియు సాహు గారపాటి సంయుక్తంగా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తారట. త్వరలోనే ఈ విషయం పై మేకర్స్ అధికారిక ప్రకటన చేయనున్నారు. రీసెంట్ గానే వీళ్లిద్దరు కలిసి మెగాస్టార్ చిరంజీవి తో ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రాన్ని నిర్మించి భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నారు, ఇప్పుడు వాళ్ళే రెండోసారి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మించదనకి రెడీ అవుతున్నారు. అలా ఒక చేతి నుండి మరో చేతికి మారింది ఈ చిత్రం. విడుదలకు ముందే ఇలాంటి పరిస్థితి మెగాస్టార్ చిరంజీవి సినిమాకు, అది కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రావడం దురదృష్టకరం. KVN ప్రొడక్షన్స్ సంస్థ అతి తక్కువ సమయం లోనే టాప్ రేంజ్ లోకి వచ్చిన వాళ్ళు. కానీ దురదృష్టం కొద్దీ వాళ్లకు ‘జన నాయగన్’ రూపం లో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది.
రీసెంట్ గా ఆ చిత్ర హీరో విజయ్ ఒక నేషనల్ మీడియా తో మాట్లాడుతూ ‘ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే ముందు సినిమాలను వదిలేయాలని నిర్ణయం తీసుకోవడానికి కారణం ఇదే. ఇప్పుడు నా ‘జన నాయగన్’ పరిస్థితి చూడండి ఎలా ఉందో. విడుదల అవుతుందా లేదా అనే పరిస్థితి వచ్చింది. ఈ చిత్రం విషయం లో నా నిర్మాతలను తల్చుకుంటే ఏడుపొస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు విజయ్. ఆయన చెప్పిన మాటలు ముమ్మాటికీ నిజమే.ఇప్పుడు విజయ్ రాజకీయాల్లో ఉన్నాడు అనే ఒకే ఒక కారణం చేత KVN ప్రొడక్షన్స్ సంస్థ జీవితం తలక్రిందులైంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సంస్థ ఈ చిక్కుముడుల నుండి బయటపడి మళ్లీ వరుసగా సినిమాలు చేసే స్థాయికి చేరుకుంటారో లేదో చూడాలి.