The Boss Movie: డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఏం చేసినా సంచలనమే అవుతుంటుంది. వివాదాస్పద అంశాలపై తనదైన శైలిలో స్పందించడం వర్మకు అలవాటు. ఎప్పుడు ఏదో ఒక అంశం మీద స్పందిస్తూ నిత్యం వార్తల్లో ఉండే వర్మ ‘బాబా’గా మారితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా ‘ద బాస్’…. ‘నెవర్ డైస్’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాలో షకలక శంకర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈశ్వర్ బాబు ధూళిపూడి దర్శకత్వంలో బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై బొమ్మకు మురళి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
అయితే తాజాగా ఈ సినిమా లోగోను ప్రముఖ నటుడు సునీల్ విడుదల చేశారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ… వర్మను పోలిన వ్యక్తిగా ‘షకలక’ శంకర్ అద్భుతంగా చేసి ఉంటాడని సునీల్ పేర్కొన్నారు. తనపై సెటైరికల్‌గా సినిమా తీసినా సరే రామ్ గోపాల్ వర్మ పాజిటివ్‌గా స్పందించారని మూవీ యూనిట్ పేర్కొన్నారు. అలానే చిత్రా నిర్మాత బొమ్మకు మురళి మాట్లాడుతూ… సమాజంలోని పలు రుగ్మతలను మా సినిమా ప్రశ్నిస్తుంది. సునీల్ మా సినిమా టైటిల్ లోగోను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది అని పేర్కొన్నారు. త్వరలోనే సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం అని చెప్పారు.
సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ దాదాపుగా పూర్తి అయ్యిందని… ఈ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుందని దర్శకుడు ఈశ్వర్ బాబు తెలిపారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా దేబోరా డోరిస్ ఫెల్ నటిస్తుంది. అలానే సొహైల్, సన, హర్షవర్ధన్, పోసాని కృష్ణమురళి, ‘వకీల్ సాబ్’ ఫేమ్ సూపర్ విమెన్ లిరిష, పటాస్ ప్రవీణ్ తదితరులు నటించారు. ఈ సినిమాకు అంకిత్ భవనాసి అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరించగా… బాద్షా హెచ్.కె డైలాగ్స్ అందించారు. ఈ సినిమాకు హిమాన్షు సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.