NTR: సాంఘిక చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న రోజులు అవి. సాంఘిక చిత్రాలలో కృష్ణ, శోభన్ బాబు తిరుగులేని స్టార్ హీరోలుగా తమకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. మరోపక్క సీనియర్ హీరోలు ‘ఎన్టీఆర్, ఏఎన్నార్’ పని అయిపోయిందని కామెంట్స్ ఎక్కువ అవుతున్న రోజులు అవి. కానీ, నటనలో విశ్వవిఖ్యాత నటసార్వభౌమగా ఎన్టీఆర్ కి ఉన్న ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ముఖ్యంగా పౌరాణిక పాత్రలు వేయడంలో ఎన్టీఆర్ తనకు తానే సాటి అని ఎన్నోసార్లు ఘనంగా నిరూపించుకున్నారు. ఎన్టీఆర్ ఓ పౌరాణిక సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. పేరు ‘దానవీరశూరకర్ణ’ అని వెంటనే ప్రకటించారు. కానీ షూటింగ్ కి నటీనటులు దొరకడం లేదు. కృష్ణ పోటీగా చేస్తున్న కురుక్షేత్రం సినిమా కోసం అందరూ అవుట్ డోర్ షూట్ కి వెళ్లారు.
Also Read: వంగవీటి… వైసీపీకి దూరంగా.. టీడీపీకి దగ్గరగా.. ఏం జరిగింది?
1977 జనవరి 14న సంక్రాంతి కానుకగా ‘దానవీరశూరకర్ణ’ను రిలీజ్ చేస్తున్నాం అంటూ ఎన్టీఆర్ అప్పటికే ప్రకటించారు. ఆ రిలీజ్ ఆపడమే కృష్ణ ఎత్తుగడ. పైగా సంక్రాంతికి తన సినిమాని రిలీజ్ చేయాలనుకున్నారు. ఇటు నటీనటులు లేకుండానే ‘దానవీరశూరకర్ణ’ షూటింగ్ మొదలైంది. అందరూ షాక్ గా చూస్తున్నారు. ఎన్టీఆర్ కర్ణుడు గెటప్ లో సెట్ కి వచ్చారు. షాట్ మేకింగ్ నుంచి మేకప్ వరకూ ప్రతిదీ ఎన్టీఆరే చూసుకుంటున్నారు.
‘దానవీరశూరకర్ణ’కు ఎన్టీఆరే రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారు. పైగా తాను దర్శకత్వం వహించడంతో పాటు దుర్యోధనుడు – కర్ణుడు – కృష్ణుడిగా ఇలా మూడు విభిన్న పాత్రల్లో నటించారు. కీలక పాత్రలకు నటులు కూడా లేకపోయే సరికి ఎన్టీఆర్ తనయులు బాలకృష్ణ – హరికృష్ణ ఇద్దరు కూడా ఈ సినిమాలో నటించారు. సినిమాని ఎన్టీఆర్ చాలా వేగంగా పూర్తి చేసి రిలీజ్ చేశారు. 9 కేంద్రాల్లో ఈ సినిమా 100 రోజులు ఆడింది. విచిత్రం ఏంటంటే ఈ సినిమా సెకండ్ రిలీజ్‌లో కూడా 100 రోజులు ఆడింది.
అసలు ఈ రికార్డు నేటికీ ఏ సినిమాకు లేదు. పైగా ఆ రోజుల్లో కేవలం రు. 20 లక్షలతో తీసిన ఈ చిత్రం.. 15 రెట్లు ఎక్కువుగా లాభాలను సాధించింది. ఇది ఇప్పటికీ రికార్డే. ఆ రోజుల్లోనే ఈ చిత్రం రూ. 3 కోట్లకు పైగా నెట్ వసూల్లు చేసింది. అసలు నాలుగు గంటలకు పైగా నిడివి ఉంటుంది ఈ సినిమా. అయినా ఎక్కడా బోర్ కొట్టదు. తెలుగు సినిమా చరిత్రలోనే కాదు, మొత్తం భారతదేశ సినిమా చరిత్రలోనే పెద్ద సినిమాగా ఈ చిత్రం రికార్డులకు ఎక్కింది.
ఇక ఈ చిత్రం ప్రభంజనంలో కృష్ణ మల్టీస్టారర్ కురుక్షేత్రం అతి దారుణంగా పరాజయం పాలైంది. కృష్ణ ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. ఆ సమయంలోనే ఎన్టీఆర్ కి ఎవరూ పోటీ కారు అని కృష్ణ పరోక్షంగా అంగీకరించాల్సి వచ్చింది.
Also Read: ప్రమోషన్స్ కోసం “ఆర్‌ఆర్‌ఆర్” యూనిట్ ఎంత ఖర్చు పెట్టారో తెలుసా ?