Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ షూటింగ్ శరవేగంగా సాగుతుంది..నిన్న మొన్నటి వరకు రామోజీ ఫిల్మ్ సిటీ లో భారీ షెడ్యూల్ ని పూర్తి చెయ్యగా, ఇప్పుడు లేటెస్ట్ షెడ్యూల్ మొన్న గురువారం నుండి అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభం అయ్యింది..ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ హాఫ్ ని పూర్తి చేశారు.

మొన్న జరిగిన లాంగ్ షెడ్యూల్ లో మూవీ కి సంబంధించిన ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు వచ్చే భారీ ఫైట్ సన్నివేశం ని తెరకెక్కించారు..తదుపరి షెడ్యూల్ నుండి సెకండ్ హాఫ్ తీయబోతున్నారు..ఇందుకోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ ఖర్చులతో దర్బార్ సెట్ ని కూడా వేశారు..ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో బాబీ డియోల్ కూడా పాల్గొనబోతున్నాడు..ఈరోజు ఆయన షూటింగ్స్ సెట్స్ లో అడుగుపెడుతున్న వీడియో ని మూవీ టీం ట్విట్టర్ ద్వారా విడుదల చేసింది.
ఇందులో బాబీ డియోల్ ఔరంగ జేబు పాత్రలో నటిస్తున్నాడు..ఆయనతో పాటుగా నోరా ఫతేహి కూడా ఈ చిత్రం లో నటిస్తుంది..ఇలా రాను రాను ‘హరి హర వీరమల్లు’ చిత్రం చాలా పెద్ద ప్రాజెక్ట్ గా మారుతూ వస్తుంది..ఇక ఈ సినిమాని తొలుత మార్చి 28 వ తారీఖున విడుదల చేద్దామని అనుకున్నారు..కానీ షూటింగ్ మరింత ఆలస్యం అయ్యేలాగా ఉండడం తో గబ్బర్ సింగ్ విడుదల తేదీ అనగా మే 12 వ తారీఖున లేదా మే 28 వ తారీఖున విడుదల చెయ్యడానికి ఆలోచిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ కెరీర్ లో మొట్టమొదటి పీరియాడికల్ పాన్ ఇండియన్ సినిమా కావడం తో ఈ మూవీ పై అభిమానుల్లోనే కాదు, ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి..అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాని చిరస్థాయిగా గుర్తుండిపోయేలా డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తున్న వార్త.