https://oktelugu.com/

Thammudu Movie Heroine: ‘తమ్ముడు’ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూశారా? అస్సలు గుర్తుపట్టలేరు..

1999లో లవ్ ఎమోషనల్ సినిమాలు తక్కువగా వచ్చాయి. ఈ సమయంలో ఓ వైపు యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు లవ్ ఎమోషనల్ నేపథ్యంలో జూలై 15న థియేటర్లోకి వచ్చింది ‘తమ్ముడు’. అన్న కోసం పవన్ పెట్టుకున్న టార్గెట్ ను ఉద్దేశంగా తీసిన ఈ మూవీకి అరుణ్ ప్రసాద్ డైరెక్షన్ చేశారు.

Written By:
  • Srinivas
  • , Updated On : September 15, 2023 / 08:34 AM IST

    Thammudu Movie Heroine

    Follow us on

    Thammudu Movie Heroine:‘పెదవి దాటని మాటొకటుంది’.. అనే సాంగ్ వినిపించగానే శ్రోతల మనసు ఉల్లాసంగా మారుతుంది. రిపీట్ చేస్తూ ఈ సాంగ్ వినాలని అనిపిస్తుంది. ఈ ఒక్కటే కాదు ఇంకా చాలా సాంగ్స్ తో పాటు సినిమా కూడా బంపర్ హిట్టు కొట్టింది ‘తమ్ముడు’. క్రేజీ హీరో పవన్ కల్యాణ్ బ్లాక్ బస్టర్ ‘తొలిప్రేమ’ తరువాత ‘తమ్ముడు’తో మరో హిట్టును అందుకున్నాడు. దీంతో అప్పటి నుంచి ఆయన సక్సెస్ కెరీర్ స్టార్ట్ అయింది. ఇక ఈ సినిమాలో పవన్ కు జోడీగా నటించింది ప్రీతి జింగానియా. పవన్ ను ప్రేమించే అమ్మాయి గా నటించిన ఆమె కొన్ని సినిమాల్లో నటించి కనుమరుగైపోయింది. చాలా ఏళ్ల తరువాత ఇటీవల సోషల్ మీడియా ద్వారా దర్శనమిచ్చింది. ఆమెను ఇప్పుడు చూస్తే షాక్ అవ్వడం ఖాయం.

    1999లో లవ్ ఎమోషనల్ సినిమాలు తక్కువగా వచ్చాయి. ఈ సమయంలో ఓ వైపు యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో పాటు లవ్ ఎమోషనల్ నేపథ్యంలో జూలై 15న థియేటర్లోకి వచ్చింది ‘తమ్ముడు’. అన్న కోసం పవన్ పెట్టుకున్న టార్గెట్ ను ఉద్దేశంగా తీసిన ఈ మూవీకి అరుణ్ ప్రసాద్ డైరెక్షన్ చేశారు. బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మాణంలో వచ్చిన ఇందులో పవన్ తో పాటు ప్రీతి జింగానియా, అతిధి గోవిత్రికర్ నటించారు.

    Thammudu Movie Heroine

    ఈ సినిమా లవ్ ఎమోషన్ లో అతిథి గోవట్కర్ మెయిన్ హీరోయిన్ అనిపిస్తుంది. కానీ సాంప్రదాయ అమ్మాయి పాత్రలో నటించిన ప్రీతి జింగానియా కే ఎక్కువ మార్కులు పడ్డాయి. పవన్ ను ప్రేమించే అమ్మాయి గా కనిపిస్తూ అలరిస్తుంది. ఒక తెలుగు అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి ఎన్నికలు కంటుంది, కోరుకున్న అబ్బాయి దక్కకపోతే ఏం చేస్తుంది? అనే సీన్స్ ఆకట్టుకున్నాయి. ఇలాంటి సీన్స్ యూత్ కి బాగా నచ్చడంతో సినిమా బంపర్ హిట్ గా నిలిచింది.

    ఈ సినిమా తరువాత ప్రీతి జింగానియా వెంటనే అగ్రహీరో బాలకృష్ణ సినిమా ‘నరసింహానాయుడు’లోనటించింది. ఈ మూవీ కూడా ఆల్ టైం రికార్డు అన్నట్లుగా హిట్టుకొట్టింది. దీంతో ప్రీతి జింగానియా కు తిరుగులేదు అన్నారు. కానీ ఆమె జీవితంలో అనుకున్నట్లు సాగలేదు. నరసింహనాయుడు తరువాత మోహన్ బాబు తో ‘అతిథి’, రాజేంద్ర ప్రసాద్ తో ‘అప్పారావు డ్రైవింగ్ స్కూల్ ’లాంటి సినిమాల్లో నటించింది. కానీ అనుకున్న స్టార్ గుర్తింపు రాలేదు.

    దీంతో ప్రీతి జింగానియా ప్రముఖ నటుడు పర్విన్ దబాస్ ను పెళ్లి చేసుకొని సెటిలయి పోయింది. పెళ్లయిన తరువాత ప్రీతి జింగానీయా మళ్లీ సినిమాల్లోకి రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం మెరుస్తోంది. తాజాగా ఆమెకు సంబంధించిన ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ప్రీతి జింగానియా పూర్తిగా మారిపోయింది. అప్పుడు ‘తమ్ముడు’ సినిమాల్లో ఎంతో అందంగా అలరించిన ప్రీతి జింగానియా ఇప్పటి ఫోటోలు చూసి షాక్ అవుతున్నారు.