https://oktelugu.com/

Kalki Teaser Review : కల్కి టీజర్లో అదే పెద్ద సస్పెన్సు… ఆయన పాత్ర ఏమై ఉంటుంది?

అయితే కమల్ హాసన్ పాత్రను చూపించలేదు. టీజర్లో ఇదో సస్పెన్సు. కమల్ హాసన్ పాత్ర ఏంటనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయన కల్కి మూవీలో విలన్ కూడా కావొచ్చు అంటున్నారు. అలాగే కల్కి రెండు భాగాలుగా విడుదలయ్యే అవకాశం ఉండగా పార్ట్ 2 లో కమల్ హాసన్ పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని, పార్ట్ 1 లో ఆయన పాత్ర పరిమితంగా ఉంటుందని అంటున్నారు.

Written By: , Updated On : July 21, 2023 / 08:40 AM IST
Follow us on

Kalki Teaser Review : ప్రాజెక్ట్ కే చిత్ర టైటిల్ కల్కిగా నిర్ణయించారు. శాన్ డియాగో కామిక్ కాన్ వేదికగా టైటిల్ టీజర్ విడుదల చేశారు. ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్ టైటిల్ లో కే అంటే కల్కి అని తెలియజేశారు. టైటిల్ కల్కి అయినప్పటికీ కథలో ప్రాజెక్ట్ కే అనేది ఒక భాగం. దీని ప్రస్తావన ఉంది. కథా నేపథ్యంలో ఇదొక భాగమని అర్థమవుతుంది. అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత కల్కి టీజర్ విడుదలైంది. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినిమా ప్రేమికులు టీజర్ కోసం నిద్రమాని ఎదురుచూశారు. వారి నిరీక్షణకు ఫలితం దక్కింది. 

 
ఫస్ట్ లుక్ చూసి భయపడ్డ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కల్కి టీజర్ సినిమాలో విషయం ఉందన్న భావన కలిగించింది. టీజర్లో నాలుగు పాత్రలను పరిచయం చేశారు. కల్కిగా ప్రభాస్ ని చూపించారు. అమితాబ్ పాత్ర ఆసక్తి రేపింది. ఆయన లుక్ తో మెప్పించింది. అలాగే అమితాబ్ పాత్ర చాలా ప్రధానమని తెలుస్తుంది. ఈ పాత్రకు యాక్షన్ సన్నివేశాలు కూడా ఉన్నాయని అర్థం అవుతుంది. టీజర్లో అమితాబ్ ని చాలా వీరోచితంగా చూపించారు. 
 
దీపికా పదుకొనె లుక్ సైతం ఆసక్తి పెంచేలా ఉంది. గతంలో ఆమె ప్రీ లుక్ విడుదల చేశారు. అందులో అమీర్ వారియర్ ని తలపించారు. టీజర్లో సాఫ్ట్ గా కనిపించారు. ఆమె పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయనిపిస్తుంది. అనూహ్యంగా తమిళ నటుడు పశుపతి తెరపైకి వచ్చాడు. పశుపతి ప్రాజెక్ట్ కే మూవీలో భాగమైన సమాచారం లేదు. టీజర్లో ఆయన్ని ప్రధానంగా చూపించారు. 
 
అయితే కమల్ హాసన్ పాత్రను చూపించలేదు. టీజర్లో ఇదో సస్పెన్సు. కమల్ హాసన్ పాత్ర ఏంటనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయన కల్కి మూవీలో విలన్ కూడా కావొచ్చు అంటున్నారు. అలాగే కల్కి రెండు భాగాలుగా విడుదలయ్యే అవకాశం ఉండగా పార్ట్ 2 లో కమల్ హాసన్ పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని, పార్ట్ 1 లో ఆయన పాత్ర పరిమితంగా ఉంటుందని అంటున్నారు. అలాగే దిశా పటాని కూడా టీజర్లో కనిపించలేదు. 

YouTube video player