Kalki 2898 AD Glimpse : ‘కల్కి’గా ప్రభాస్ విశ్వరూపాన్ని చూపించేసారు!

కలియుగ అంతానికి కారణం కల్కి దేవుడు అని , శ్రీ మహావిష్ణవు ఆఖరి అవతారమే ఈ కల్కి అని మన పురాణాలూ చెప్తూనే ఉన్నాయి. ఆ కల్కి పాత్రలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించాడు.

Written By: Vicky, Updated On : July 21, 2023 8:55 am
Follow us on

Kalki 2898 AD Glimpse : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ప్రాజెక్ట్ k ‘ చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్ వీడియో ని 1 గంట నుండి 2 గంటల ప్రాంతం లో కామిక్ కాన్ వద్ద విడుదల చేసారు. ఈ గ్లిమ్స్ కి ఫ్యాన్స్ నుండే కాకుండా ఆడియన్స్ నుండి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న ది బెస్ట్ సినిమా ఇదే అని అందరూ పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు.

కొత్త డైరెక్టర్ నాగ అశ్విన్ ఇంత పెద్ద భారీ బడ్జెట్ సినిమాని ఎలా హ్యాండిల్ చెయ్యగలుతాడో అని అభిమానుల్లో మొదట్లో కాస్త సందేహాలు పెట్టుకున్న విషయం వాస్తవమే. మొన్న విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి వచ్చిన నెగటివ్ రెస్పాన్స్ ని చూసి, ఈ సినిమా ఔట్పుట్ కూడా ఇదే రేంజ్ లో ఉంటుందేమో అని అభిమానులు భయపడ్డారు.

కానీ గ్లిమ్స్ వీడియో మాత్రం వాళ్ళను ఒక రేంజ్ లో సర్ప్రైజ్ కి గురి చేసింది. ముఖ్యంగా గ్లిమ్స్ లోని విజువల్స్ హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి. ఈ గ్లిమ్స్ లో కేవలం ప్రభాస్ , దీపికా పదుకొనే ని మాత్రమే చూపించారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ని ప్రస్తుతానికి అయితే చూపించలేదు. ప్రపంచం మొత్తాన్ని దుష్ట శక్తులు ఏలుతున్న సమయం లో వాళ్ళను మట్టికరిపించడానికి టైం ట్రావెల్ మెషిన్ ద్వారా 2898 లో జన్మించబోయే కల్కి ని 2024 వ సంవత్సరం లోకి తీసుకొని రావడమే ప్రాజెక్ట్ K.

కలియుగ అంతానికి కారణం కల్కి దేవుడు అని , శ్రీ మహావిష్ణవు ఆఖరి అవతారమే ఈ కల్కి అని మన పురాణాలూ చెప్తూనే ఉన్నాయి. ఆ కల్కి పాత్రలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించాడు. గ్లిమ్స్ వీడియో తోనే అద్భుతమైన పాజిటివ్ ఫీలింగ్ ని రాబట్టిన ఈ సినిమా ఇక రాబొయ్యే రోజుల్లో ఎలాంటి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారబోతుందో చూడాలి.