https://oktelugu.com/

TG Vishwa Prasad: రెండేళ్లలో హాలీవుడ్ సినిమాలను నిర్మించడమే నా లక్ష్యం అంటూ సంచలన కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్ ‘బ్రో’ చిత్ర నిర్మాత!

ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'ఆదిపురుష్' చిత్రం తెలుగు వెర్షన్ రైట్స్ ని 180 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. మరో మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అనీ ప్రాంతీయ భాషల్లో ఘనంగా విడుదల కాబోతుంది.

Written By: , Updated On : June 13, 2023 / 06:20 PM IST
TG Vishwa Prasad

TG Vishwa Prasad

Follow us on

TG Vishwa Prasad: ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయం లోనే పెద్ద స్టార్ హీరోలతో వరుసపెట్టి సినిమాలను నిర్మిస్తూ అతి పెద్ద ప్రొడక్షన్ హౌస్ గా పేరు తెచ్చుకుంది ‘పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ’. ఈ సంస్థ నుండి ఇప్పటి వరకు వచ్చిన సినిమాలలో ‘ది కాశ్మీర్ ఫైల్స్’ ,’కార్తికేయ 2′ మరియు ‘ధమాకా’ వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ సంస్థ ప్రభాస్ తో ఒక చిత్రాన్ని నిర్మిస్తుంది.

అలాగే ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఆదిపురుష్’ చిత్రం తెలుగు వెర్షన్ రైట్స్ ని 180 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. మరో మూడు రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అనీ ప్రాంతీయ భాషల్లో ఘనంగా విడుదల కాబోతుంది. అంతే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా పెట్టి ‘బ్రో ది అవతార్’ అనే చిత్రాన్ని కూడా నిర్మించారు, వచ్చే నెల 28 వ తారీఖున ఈ సినిమా విడుదల కాబోతుంది.

ఇక జూన్ 16 వ తేదీన విడుదల అవ్వబోతున్న ‘ఆదిపురుష్’ మూవీ కి సంబంధించిన ప్రొమోషన్స్ కార్యక్రమం లో భాగంగా,పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ అధినేత టీజీ విశ్వప్రసాద్ కాసేపు మీడియా తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘మా సంస్థ నుండి రెండు మూడేళ్ళలో పాన్ వరల్డ్ చిత్రాలు మరియు హాలీవుడ్ చిత్రాలను నిర్మించాలి.అదే మా లక్ష్యం’ అని చెప్పుకొచ్చాడు.

ప్రతీ వ్యాపారం లో మనం కొన్ని లక్ష్యాలను పెట్టుకోవాలి, అంచనాలకు మించి లక్ష్యాలు పెట్టుకోవడం వల్ల కూడా మనం కొన్ని సార్లు నష్టపోతుంటాము. మేము అలాంటి వాళ్ళం కాదు, కానీ మా సత్తా ఏంటో మాకు తెలుసు,అందుకు తగ్గట్టుగానే ప్రాజెక్ట్స్ ని సెట్ చేసుకున్నాము అంటూ చెప్పుకొచ్చాడు విశ్వ ప్రసాద్. ఆదిపురుష్ చిత్రాన్ని ఆయన 180 కోట్ల రూపాయలకు తెలుగు వెర్షన్ రైట్స్ ని కొనుగోలు చేసాడు. మరి ఈ సినిమా ఆయనకీ లాభాల్ని తెచ్చిపెడుతుందా, లేదా నష్టాలను మిగిలిస్తుందా అనేది తెలియాలంటే మరో మూడు రోజులు ఆగాల్సిందే.