EmmaStone : అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో డాల్బీ థియేటర్ వేదికగా ఈసారి జరిగిన ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం నటీనటులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఈసారి జరిగిన సంఘటనలు అటువంటివి కాబట్టి. జాన్ సీన అనే నటుడు నగ్నంగా అవార్డుల స్టేజి మీదకి వచ్చి సంచలనం సృష్టించాడు. పాపులర్ అమెరికన్ రెజ్లర్ అయిన ఈ నటుడు అలా నగ్నంగా రావడం పట్ల అందరూ అవాక్కయ్యారు. అయితే అతడు గోచి లాంటిది పెట్టుకున్నాడని.. తర్వాత వేదిక మీద ఉన్న వారు ఒక దుప్పటి లాంటిది ఇచ్చారని ప్రచారం జరిగింది.. ఆ విషయాన్ని మర్చిపోకముందే.. మరో నటి డ్రెస్ చినిగింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
అకాడమీ ప్రకటించిన ఉత్తమ హీరోయిన్ కేటగిరిలో పూర్ థింగ్స్ అనే సినిమాకు గానూ ఎమ్మా స్టోన్ ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది. ఈ పురస్కారం తీసుకెళ్లే క్రమంలో వేదికపై ఆమె వేసుకున్న డ్రెస్ చినిగిపోయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు.” ఎవరు నా వైపు చూడొద్దు. నా డ్రెస్ బాగాలేదు. ఇక్కడికి వచ్చే క్రమంలో చినిగిపోయింది. ఇది నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇలాంటి వేడుకలో అలాంటి చినిగిపోయిన డ్రెస్ వేసుకోవాలి అని నేను అనుకోలేదు. కానీ జరిగిపోయింది.. అంతా నా ఖర్మ” అంటూ స్టోన్ వేదిక ముందు నుంచే వ్యాఖ్యానించింది. తనవైపు ఎవరు చూడవద్దని చెబుతూనే.. చినిగిన డ్రెస్సును కెమెరాకు చూపించింది.. దీంతో ఈ వీడియో ఒకసారి గా చర్చనీయాంశంగా మారింది.
ఎన్నడూ లేనంతగా ఈసారి వేడుకల్లో పలు వివాదాస్పద ఘటనలు చోటుచేసుకున్నాయి. ఒక నటుడు నగ్నంగా రావడం, మరొక నటి డ్రెస్ చినిగిపోవడం.. కొందరు వేదిక మీద అత్యుత్సాహం ప్రదర్శించడం.. మీడియా ప్రతినిధుల ఎదుట అతి చేయడం.. వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈసారి అకాడమీ అవార్డుల ప్రధానోత్సవం లో క్రమశిక్షణ లోపించింది అని పాశ్చాత్య మీడియా రాసిందంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రశ్న సోషల్ మీడియాలో ఎమ్మా స్టోన్ డ్రెస్ చినిగిన తాలూకూ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
: https://t.co/8KPQhesjMq
Congratulations to #EmmaStone for winning Best Actress in a Leading Role, just don’t look at her dress. #Oscars pic.twitter.com/8w8kBmY9mu— E! News (@enews) March 11, 2024