2018 OTT Release Date: రీసెంట్ సమయం లో మలయాళం బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన చిత్రం ‘2018’.మలయాళం లాంటి చిన్న ఇండస్ట్రీ నుండి 200 కోట్ల రూపాయిల వైపు పరుగులు తీస్తున్న చిత్రం గా సరికొత్త చరిత్ర సృష్టించింది ఈ సినిమా. రీసెంట్ గానే తెలుగు లో కూడా విడుదలై మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని దక్కించుకొని ఆరు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది.
ఫుల్ రన్ లో పడి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికీ ఈ సినిమా మలయాళం వసూళ్లు జోరు ఏమాత్రం దక్కలేదు. ఇంచుమించుగా మొదటి వారం లో ఉన్న డైలీ కలెక్షన్స్ ట్రెండ్ కి అటు ఇటుగా ఈ వారం కలెక్షన్స్ ట్రెండ్ కూడా ఉంది. అంత పెద్ద సెన్సేషన్ సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతున్న ఈ సినిమాని అప్పుడే ఓటీటీ లో విడుదల చేస్తున్నారట.
ఈ సినిమా ఓటీటీ రైట్స్ ని సోనీ లివ్ సంస్థ భారీ మొత్తానికి కొనుగోలు చేసి చాలా రోజులే అయ్యిందట. అందుకే ఈ చిత్రం మలయాళం వెర్షన్ ని జూన్ 7 వ తారీఖు నుండి విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారట. అయితే కేవలం మలయాళం వెర్షన్ ని మాత్రమే విడుదల చేస్తున్నారా?, లేదా తెలుగు, తమిళ వేషన్స్ ని కూడా విడుదల చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.
అయితే ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూసినప్పుడు వచ్చే అనుభూతి, ఓటీటీ లో చూస్తే రాదనీ, కాబట్టి కచ్చితంగా థియేటర్ లోనే చూడాల్సిందిగా విశ్లేషకులు చెప్తున్నారు.థియేటర్స్ లో ఇంకా మంచి రన్ ని దక్కించుకుంటున్న ఈ చిత్రాన్ని అప్పుడే ఓటీటీ లో విడుదల చెయ్యడం ఎందుకు, సినిమా రన్ ని కిల్ చెయ్యడం ఎందుకు అంటూ కొంతమంది 2018 టీం పై విరుచుకుపడుతున్నారు.