https://oktelugu.com/

Bigg Boss 7 Telugu: శివాజీ ఫ్రస్ట్రేషన్ పీక్స్… బూతులు మాట్లాడుతా, అసలు గేమ్ బయటకు తీస్తా!

ప్రియాంక .. శివాజీ దగ్గరకు వచ్చి ఆమె చేసిన మిస్టేక్ ఏంటో చెప్తే వింటాను అని అడిగింది. మీరు మార్చుకోలేరు .. అనుభవం కావాలి అంటూ శివాజీ చెప్పాడు. ఇక గౌతమ్ అయితే 'శివాజీ అన్న తప్పు చేస్తారు .

Written By: , Updated On : November 21, 2023 / 06:12 PM IST
Bigg Boss 7 Telugu

Bigg Boss 7 Telugu

Follow us on

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో 12వ వారం నామినేషన్స్ రసవత్తరంగా సాగాయి. ఎప్పటిలానే ఈసారి కూడా కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో కొట్లాడుకున్నారు. కాగా గత వారం మొదలైన ఎవిక్షన్ పాస్ డ్రామా ఇంకా కొనసాగుతుంది. యావర్ ఎవిక్షన్ పాస్ తిరిగి ఇచ్చేయడంతో .. ఈ వారం మళ్ళీ ఎవిక్షన్ పాస్ కోసం పోటీ నిర్వహిస్తున్నాడు బిగ్ బాస్. ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో ముందుగా ఇంటి సభ్యులందరూ నామినేషన్స్ లో జరిగిన గొడవల గురించి డిస్కషన్ పెట్టారు. ఏంట్రా ఏడ్చినందుకు నామినేట్ చేస్తారా అంటూ ప్రశాంత్ తో చెప్పుకున్నాడు.

ప్రియాంక .. శివాజీ దగ్గరకు వచ్చి ఆమె చేసిన మిస్టేక్ ఏంటో చెప్తే వింటాను అని అడిగింది. మీరు మార్చుకోలేరు .. అనుభవం కావాలి అంటూ శివాజీ చెప్పాడు. ఇక గౌతమ్ అయితే ‘శివాజీ అన్న తప్పు చేస్తారు .. మీరు చేసింది తప్పు అని చెప్తే సర్రున రైజ్ అవుతాడు’ అంటూ అర్జున్ తో డిస్కషన్ పెట్టాడు.గౌతమ్ గురించి చెప్తూ ‘ మారాడు అనుకున్న అన్న అని ప్రశాంత్ అంటే మారడు .. అంతా నటన అని శివాజీ చెప్పాడు.

ఇక అశ్విని తో మాట్లాడుతూ ‘ ఇక నుంచి స్టార్ట్ అయిపోతాయి నాకు బూతులు అని అన్నాడు శివాజీ. ఇక నుంచి అసలైన ఆట మొదలవుతుంది అన్నా అని అశ్విని చెప్పింది. ఇక తర్వాత ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం కంటెస్టెంట్స్ కి ఆఖరి ఛాన్స్ ఇస్తున్నట్లు బిగ్ బాస్ తెలిపారు. ఇందుకోసం అందరికీ కలిపి గేమ్ ఇచ్చారు. ఇందులో ఒక హేండిల్ పై బిగ్ బాస్ చెప్తున్నా సామాన్లు పెడుతూ కింద పడకుండా బాలన్స్ చేయాలి.

శోభా కాసేపటికి బాలన్స్ చేయలేక కింద పడేసింది. తర్వాత రతిక రేస్ నుంచి తప్పుకుంది. కొంతసేపటికి అర్జున్, యావర్, గౌతమ్ కూడా పట్టుకోలేక హ్యాండిల్ వదిలేశారు. తర్వాత శివాజీ గట్టిగానే ట్రై చేసాడు కానీ పడిపోయాయి. ఇక చివరికి ప్రశాంత్ .. ప్రియాంక మాత్రం బ్యాలెన్స్ చేస్తూ గేమ్ లో నిలిచారు. ఇక ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అనేది ప్రోమోలో సస్పెన్సు పెట్టారు.కానీ లైవ్ ఎపిసోడ్ లో ప్రశాంత్ గెలిచాడు.

 

Bigg Boss Telugu 7 Promo 2 - Day 79 | Bigg Boss Last Chance to Win Eviction Pass | DisneyPlusHotstar