Renu Desai about Mahesh Babu film: ‘బద్రి’ చిత్రం తో హీరోయిన్ గా పరిచయమైనా రేణు దేశాయ్(Renu Desai), తొలిసినిమాతోనే అప్పటి యూత్ ఆడియన్స్ ని విశేషం గా ఆకట్టుకుంది. చూసేందుకు ఎంతో అందంగా ఉంది, నటన కూడా బాగుంది, కచ్చితంగా పెద్ద రేంజ్ కి వెళ్తుందని అంతా అనుకున్నారు. కానీ బద్రి సినిమా షూటింగ్ సమయం లోనే ఆమె పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తో ప్రేమలో పడడం, ఆ తర్వాత పెళ్లి అయ్యాక సినిమాలకు పూర్తిగా దూరం అవ్వడం జరిగింది. కానీ కొన్నేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తూ, దర్శకత్వం వహించిన ‘జానీ’ మూవీ తో రీ ఎంట్రీ ఇచ్చింది. కేవలం పవన్ కళ్యాణ్ హీరో కాబట్టే ఆ సినిమాలో నటించింది కానీ, ఆ తర్వాత నటన కొనసాగించలేదు. కేవలం పవన్ కళ్యాణ్ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా మాత్రమే పని చేస్తూ వచ్చింది.
ఇక ఆయనతో విడాకులు తీసుకున్న తర్వాత రేణు దేశాయ్ తన సొంత కాళ్ళ మీద నిలబడేందుకు కొన్ని మరాఠీ సినిమాలకు దర్శకత్వం వహించింది. అవి అనుకున్న రేంజ్ లో సక్సెస్ అవ్వలేదు. దీంతో మళ్లీ ఆమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంది. ఆమె ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు టాలీవుడ్ నుండి బోలెడన్ని ఆఫర్స్ వచ్చాయి. వాటిల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu) ‘సర్కారు వారి పాట’ చిత్రం కూడా ఉంది. ఇందులో నదియా పోషించిన బ్యాంక్ మ్యానేజర్ పాత్ర మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఈ పాత్ర కోసం ముందుగా రేణు దేశాయ్ నే సంప్రదించారట. కానీ అప్పుడు ఉన్న పరిస్థితుల కారణంగా ఈ పాత్ర చేయలేకపోయానని రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. చివరికి ఈ సినిమాతో కాకుండా, రేణు దేశాయ్ రవితేజ ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది.
ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యింది, రేణు దేశాయ్ పాత్రకు కూడా ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు పలు సినిమాల్లో ఆమె క్యారెక్టర్ రోల్స్ చేస్తోంది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఆమె వీధి కుక్కలను చంపడాన్ని వ్యతిరేకిస్తూ హైదరాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ ఎంతటి సమాసీలానం రేపిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రభుత్వాలు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం, అందుకు సుప్రీమ్ కోర్టు మద్దతుగా నిలబడడం ఆమెకు ఏ మాత్రం నచ్చలేదు. ఆమె చేసిన ఆ వ్యాఖ్యలపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. తనపై కామెంట్స్ చేస్తున్నవారి కోసం స్పెషల్ గా ఆమె వీడియో కూడా నిన్న విడుదల చేసింది.
