https://oktelugu.com/

NTR- Rajamouli: ఎన్టీఆర్ పుట్టినరోజు ని రాజమౌళి అందుకే పట్టించుకోలేదా!

NTR- Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం ఎంత పెద్ద సెన్సషనల్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..తెలుగు , హిందీ , తమిళం మరియు మలయాళం బాషలలో ఈ సినిమా సృష్టించిన వసూళ్ల సునామి మామూలుది కాదు..ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను దక్కించుకున్న ఈ చిత్రం బాహుబలి తర్వాత వెయ్యి కోట్ల రూపాయిలు కొల్లగొట్టిన రెండవ సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది..ఇక ఈ సినిమాలో హీరోలు గా నటించిన ఎన్టీఆర్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 26, 2022 / 03:50 PM IST

    Rajamouli

    Follow us on

    NTR- Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం ఎంత పెద్ద సెన్సషనల్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..తెలుగు , హిందీ , తమిళం మరియు మలయాళం బాషలలో ఈ సినిమా సృష్టించిన వసూళ్ల సునామి మామూలుది కాదు..ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను దక్కించుకున్న ఈ చిత్రం బాహుబలి తర్వాత వెయ్యి కోట్ల రూపాయిలు కొల్లగొట్టిన రెండవ సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది..ఇక ఈ సినిమాలో హీరోలు గా నటించిన ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లకు కూడా అద్భుతమైన పేరు ప్రఖ్యాతలు వచ్చాయి..ఇన్ని రోజులు కేవలం తెలుగు సినిమాకి మాత్రమే పరిచయం అయినా వీళ్లిద్దరి నటన నైపుణ్యం , ఇప్పుడు యావత్తు భారత దేశం చూసేలా చేసింది #RRR చిత్రం..అయితే మొదటి రోజు నుండి ఈ సినిమాలో మా హీరో పాత్ర తక్కువ అయ్యింది అంటూ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా లో రాజమౌళి ని టాగ్ చేసి తిడుతున్న సంగతి మన అందరికి తెలిసిందే.

    రాజమౌళి ని నమ్మి మా హీరో తన మూడేళ్ళ సుదీర్ఘ సమయాన్ని ఇస్తే దానిని సరిగా ఉపయోగించుకోలేదు అని..మా హీరో కంటే రామ్ చరణ్ కి ఎక్కువ స్కోప్ ఇచ్చారు అని నందమూరి అభిమానులు రాజమౌళి పై చాలా కోపం గా ఉన్నారు..కానీ ఎన్టీఆర్ మాత్రం తన పాత్ర పట్ల , తనకి వచ్చిన ప్రశంసల పట్ల ఎంతో తృప్తిగా ఉన్నాడు..ఇక నుండి నా కెరీర్ #RRR కి ముందు, #RRR కి తర్వాత అంటూ పలు సందర్భాలలో ఆయన తెలిపిన సంగతి కూడా మన అందరికి తెలిసిందే..త్వరలోనే #RRR పార్ట్ 2 కూడా తియ్యాలి అని ఎన్టీఆర్ పలు ఇంటర్వూస్ లో రాజమౌళి ని డిమాండ్ చేసిన సందర్భాలు కూడా మనం చూసాము..ఇక్కడ వరుకు అంత బాగానే ఉంది..కానీ ఈసారి జూనియర్ ఎన్టీఆర్ కి పుట్టిన రోజు సందర్భంగా ట్విట్టర్ లో రాజమౌళి ఎన్టీఆర్ ని విష్ చేస్తూ ఒక్క ట్వీట్ కూడా వేయకపోవడం పై అభిమానుల్లో కొత్త సందేహాలు నెలకొన్నాయి.

    Tarak, Charan

    Also Read: Gopichand Pakka Commercial: “పక్కా కమర్షియల్” నుంచి పక్కా అప్ డేట్ వచ్చింది

    ఇటీవల జరిగిన ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ లో ప్రతి ఒక్క సెలబ్రిటీ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసారు..#RRR లో నటించిన తన తోటి హీరో రామ్ చరణ్ కూడా భావోద్వేగ పూరితంగా ఎన్టీఆర్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేసాడు..కానీ రాజమౌళి మాత్రం ఒక్క ట్వీట్ కూడా వెయ్యలేదు..వాస్తవానికి ఎన్టీఆర్ మరియు రాజమౌళి మధ్య ఎంతో సన్నిహిత్య సంబంధం ఉంది..ఎన్నో సందర్భాలలో ఇద్దరు ఒక్కరిపై ఒక్కరికి ఉన్న సాన్నిహిత్యాన్ని ఎన్నో సార్లు తెలియచేసారు..కానీ ఇప్పుడు ఎన్టీఆర్ పుట్టిన రోజు ని పట్టించుకోకపోవడం పై అభిమానుల్లో రకరకాల సందేహాలు మొదలుకున్నాయి..వీళ్లిద్దరి మధ్య చెడిందా..#RRR పట్ల ఎన్టీఆర్ తన పాత్ర పై నిజంగా సంతృప్తి గా ఉన్నాడా , లేదా ఊరికే పైపైనే అభిమానుల కోసం మాట్లాడాడా అంటూ ఇలా పలు రకాల సందేహాలు మొదలుకున్నాయి..అయితే అలాంటిది ఏమి లేదు అని..ప్రతి సారి సోషల్ మీడియా ద్వారానే పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచెయ్యాల్సిన అవసరం లేదు అని..వ్యక్తిగతంగా ఫోన్ చేసి కూడా విష్ చెయ్యొచ్చు అని ఎన్టీఆర్ సన్నిహిత వర్గాలు చెప్తున్న మాట.

    Also Read: Producer M. Ramakrishna Reddy: విషాదం : ప్రముఖ నిర్మాత కన్నుమూత !

    Recommended videos:


    Tags