Balayya Came Indian Idol Show: దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన మ్యూజిక్ షో.. ఇండియన్ ఐడల్. ప్రస్తుతం ఈ షో తెలుగులో కూడా విపరీతంగా అలరిస్తోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో ప్రసారం అవుతున్న ఈ తెలుగు షో రోజురోజూకీ ప్రేక్షకాదరణ దక్కించుకుంటూ దూసుకువెళ్తుంది. అత్యుత్తమమైన తెలుగు గాత్రాన్ని కనుగొనే ఉద్దేశంతో ప్రపంచంలోనే బిగ్గెస్ట్ స్జేజ్ ప్రోగ్రామ్ గా ఈ షోను తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. అయితే, తాజాగా ఈ షోకి బాలయ్య గెస్ట్ గా వచ్చారు.

‘తెలుగు ఇండియన్ ఐడల్’ షో సెమీ ఫైనల్‌కి నట సింహం గెస్ట్ గా వచ్చి తన డ్యాన్స్ తో అదరగొట్టారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఏదైనా ఆయన దిగనంత వరకే.. వన్స్ స్టెప్ ఇన్ ఎంటర్‌టైన్మెంట్ డబుల్స్ అంటూ బాలయ్య అభిమానులు, సింగర్స్ ట్వీట్స్ చేస్తున్నారు. మొత్తానికి బాలయ్య షోలను కూడా వదలడం లేదు.
Also Read: Jayasudha: ప్చ్.. జయసుధ కోరిక నెరవేరుతుందా ?
బాలయ్య రాకతో ఆ షోల రేటింగ్ అమాంతం రెట్టింపు అవుతుంది. ప్రస్తుతం బాలయ్య – గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్స్ లో ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూట్ జరుగుతుంది. ఈ షూట్ లో ఉండగా.. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ బాలయ్యకి కాల్ చేశారు.

‘తెలుగు ఇండియన్ ఐడల్’ షోకు మీరు గెస్ట్ గా రావాలి అని బాలయ్యను కోరాడు. థమన్ కోరిక మేరకు బాలయ్య షూట్ త్వరగా ఫినిష్ చేసి మరీ ఈ షోకి గెస్ట్ గా వచ్చాడు. మొత్తానికి ఈ షోలో బాలయ్య సందడి, ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ను ఇచ్చేదే.
ఏది ఏమైనా ‘అఖండ’ తర్వాత బాలయ్య రేంజ్ మారిపోయింది. అందుకే ఈ సినిమా బడ్జెట్ విషయంలో కూడా మరో 30 కోట్లు పెరిగినట్లు తెలుస్తోంది. ఏపీలో టికెట్ రేట్లును దారుణంగా తగ్గించినా బాలయ్య వంద కోట్ల మార్క్ ను దాటాడు.
కాబట్టి.. బాలయ్యకి కరెక్ట్ సినిమా పడితే 150 కోట్లు వసూళ్లు చేసే స్టామినా ఉందని మేకర్స్ నమ్ముతున్నారు. పైగా ఆన్ స్టాపబుల్ షో సూపర్ హిట్ అవ్వడం కూడా బాలయ్యకు రెట్టింపు క్రేజ్ క్రియేట్ అయ్యేలా చేసింది.
Also Read: All Surgery Heroines: వాళ్లంతా సర్జరీల హీరోయిన్లు.. నేను విసిగిపోయాను !
Recommended Videos:
[…] Also Read: Balayya Came Indian Idol Show: ‘ఇండియన్ ఐడల్’ షోకి బాలయ్… […]
[…] Also Read: Balayya Came Indian Idol Show: ‘ఇండియన్ ఐడల్’ షోకి బాలయ్… […]
[…] Also Read: Balayya Came Indian Idol Show: ‘ఇండియన్ ఐడల్’ షోకి బాలయ్… […]