https://oktelugu.com/

Sivaji: ఆదిపురుష్ అందుకే ఫెయిల్, ఆ పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు… బిగ్ బాస్ శివాజీ సంచలన కామెంట్స్

రావణుని పాత్రకు సైఫ్ అలీ ఖాన్ పూర్తి స్థాయిలో న్యాయం చేయలేక పోయాడు, అన్నారు. ఇంకా మాట్లాడుతూ... ప్రభాస్ అంటే ప్రభాసే. ఆయనకు తిరుగులేదని శివాజీ అన్నారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : January 10, 2024 / 11:27 AM IST

    Sivaji

    Follow us on

    Sivaji: నటుడు శివాజీ కి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. అయితే చాలా కాలంగా నటనకు దూరం అయ్యారు. గతంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి గరుడ పురాణం అంటూ హడావుడి చేశారు. దీంతో జనాల్లో నెగిటివిటీ తెచ్చుకున్న శివాజీ మళ్ళీ రాజకీయాల్లో కనిపించలేదు. అయితే ఇటీవల బిగ్ బాస్ షో లో శివాజీ పాల్గొన్న సంగతి తెలిసిందే. తనదైన శైలిలో ఆట తీరు ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నాడు. షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుని సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ సంపాదించాడు శివాజీ.

    కాగా హౌస్ నుంచి బయటకు వచ్చిన శివాజీ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి. గతంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ప్రభాస్ గురించి చేసిన కామెంట్లు గురించి శివాజీ స్పందించారు. శివాజీ మాట్లాడుతూ… ప్రభాస్ ఆదిపురుష్ నేను చూశాను. డైరెక్టర్ ఓం రౌత్ రామాయణాన్ని విభిన్నంగా చూపించాలని భావించాడు. అయితే దర్శకుడు కొన్ని అంశాల్లో చేసిన తప్పులు వల్ల ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేకపోయింది.

    రావణుని పాత్రకు సైఫ్ అలీ ఖాన్ పూర్తి స్థాయిలో న్యాయం చేయలేక పోయాడు, అన్నారు. ఇంకా మాట్లాడుతూ… ప్రభాస్ అంటే ప్రభాసే. ఆయనకు తిరుగులేదని శివాజీ అన్నారు. ఆదిపురుష్ చిత్రాన్ని ఉద్దేశించి శివాజీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. మరోవైపు సలార్ సక్సెస్ కావడంతో ప్రభాస్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇక తన తర్వాత సినిమా కోసం లుక్ చేంజ్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ నటిస్తున్న కల్కి 2829 AD నెక్స్ట్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం కాబోతుందని సమాచారం.

    ఇక శివాజీ విషయానికొస్తే ప్రస్తుతం బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్ బాగా ఉపయోగించుకుంటున్నాడు. యాక్టింగ్ కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. తాజాగా నైంటీస్ అనే వెబ్ సిరీస్ లో నటించారు. నైంటీస్ సిరీస్ ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. వరుసగా యూట్యూబ్ ఛానల్స్ కు, టీవీ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా ఉంటున్నారు.