Rajeev Kanakala: బాబు అరెస్ట్ పై అందుకే ఎన్టీఆర్ మాట్లాడలేదు… అసలు మేటర్ చెప్పిన రాజీవ్ కనకాల

పరిశ్రమ సంగతి పక్కన పెడితే కుటుంబ సభ్యుడు ఎన్టీఆర్ మౌనం వహించడంపై ఓ వర్గం టార్గెట్ చేసింది. కొన్నాళ్లుగా నందమూరి అభిమానులు బాలయ్య-ఎన్టీఆర్ వర్గాలుగా విడిపోయి కొట్టుకుంటున్నారు.

Written By: Shiva, Updated On : October 13, 2023 12:51 pm

Rajeev Kanakala

Follow us on

Rajeev Kanakala: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుపై సినిమా వాళ్ళు మాట్లాడాలనేది కొందరు నేతల డిమాండ్. దీనికి మిశ్రమ స్పందన వచ్చింది. మురళీ మోహన్, రాఘవేంద్రరావు, అశ్వినీ దత్, రవి బాబుతో పాటు ఒకరిద్దరు మాత్రమే నేరుగా ఖండించారు. ఆయన అరెస్ట్ అక్రమం అన్నారు. నిర్మాత సురేష్ బాబు మాత్రం రాజకీయాలతో చిత్ర పరిశ్రమకు సంబంధం లేదన్నారు. ఇండస్ట్రీ చెన్నైలో ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నాన్ పొలిటికల్, నాన్ రెలిజియస్ విధానం అవలంబిస్తోంది. సినిమా వాళ్ళు పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వరు. ఎవరైనా మాట్లాడితే అది వాళ్ళ వ్యక్తిగతం అన్నారు.

పరిశ్రమ సంగతి పక్కన పెడితే కుటుంబ సభ్యుడు ఎన్టీఆర్ మౌనం వహించడంపై ఓ వర్గం టార్గెట్ చేసింది. కొన్నాళ్లుగా నందమూరి అభిమానులు బాలయ్య-ఎన్టీఆర్ వర్గాలుగా విడిపోయి కొట్టుకుంటున్నారు. పార్టీ అధినాయకత్వం విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుండి బాలయ్య, చంద్రబాబుకు సెగ తగులుతుంది. టీడీపీ వర్గాల్లో ఎన్టీఆర్ పై ఉన్న సానుభూతి పోగొట్టేలా వీలు దొరికినప్పుడల్లా విమర్శల దాడి జరుగుతుంది.చంద్రబాబు అరెస్ట్ పై ఎన్టీఆర్ మాట్లాడాలంటూ టీడీపీ ఎంత ఒత్తిడి చేసినా ఆయన నోరు విప్పలేదు.

సోషల్ మీడియాలో ఎన్టీఆర్ దారుణ ట్రోల్స్ కి గురయ్యాడు. కొన్ని మీడియా సంస్థలు ఎన్టీఆర్ పేరు మార్చుకోవాలని కథనాలు ప్రసారం చేశాయి. ఎన్టీఆర్ మౌనంపై ఆయన క్లోజ్ ఫ్రెండ్ రాజీవ్ కనకాల కొన్ని అభిప్రాయాలు వెల్లడించాడు. ఇందుకు ఆయన కొన్ని కారణాలు అంచనా వేశాడు. ఎన్టీఆర్ కి రాజకీయాల మీద ఆసక్తి లేదనిపిస్తుంది. గతంలో ఎన్టీఆర్ టీడీపీ పార్టీకి విస్తృత ప్రచారం చేశాడు. తన స్పీచ్ లతో ఓటర్లను ఆకట్టుకున్నాడు. తర్వాత రాజకీయాలకు దూరమయ్యాడు.

మరో ఐదారేళ్ళ వరకు ఎన్టీఆర్ కి రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదనిపిస్తుంది. అందుకే పొలిటికల్ ఈవెంట్స్ పై ఆయన మౌనం వహిస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ గురించి ఎన్టీఆర్ ఎందుకు మాట్లాడలేదనేది నాకు స్పష్టంగా తెలియదు. ఆయన చెప్పలేదు. సినిమాలతో బిజీగా ఉండటం కూడా కారణం కావచ్చు, అని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు. రాజీవ్ కనకాల మాటల ప్రకారం రాజకీయాల పట్ల ప్రజెంట్ ఆసక్తి లేని ఎన్టీఆర్ మాట్లాడలేదని అంటున్నారు