Venkatesh: సినిమా ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ కి ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది. ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే ఫ్యామిలీ ఆడియెన్స్ మొత్తం ఆయన సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ సినిమాలు చేస్తూ ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పిస్తు ఆయన చాలావరకు సక్సెస్ అయ్యాడు. ఇక అందులో భాగంగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ మాటలు అందించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సినిమాల్లో హీరోగా చేసి మంచి ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు.
ఇక ఆ సినిమాలతోనే వెంకటేష్ కామెడీ కూడా అద్భుతంగా చేయగలడు అని ప్రూవ్ చేసుకున్నాడు.ఇక ఇది ఇక ఉంటే త్రివిక్రమ్ డైరెక్టర్ గా మారి నువ్వే నువ్వే అనే సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత అతడు సినిమా చేశాడు. నిజానికి మహేష్ బాబు కంటే ముందే ఈ సినిమా స్టోరీని త్రివిక్రమ్ వెంకటేష్ కి చెప్పాడు. కానీ ఆ టైమ్ లో వెంకటేష్ కొంచెం సినిమా బిజీలో పడి ఆ స్క్రిప్ ని సరిగ్గా పట్టించుకోలేదు.
ఇక ఆ తర్వాత ఆ స్టోరీ వెంకటేష్ నుంచి పవన్ కళ్యాణ్ దగ్గరికి, పవన్ కళ్యాణ్ నుంచి మహేష్ బాబు దగ్గరికి వచ్చింది. లేకపోతే వెంకటేష్ అతడు సినిమాలో నటించి ఒక మంచి సక్సెస్ ని అందుకునేవాడు. ఇక అప్పటికే త్రివిక్రమ్ కి వెంకటేష్ కి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉండడంతో త్రివిక్రమ్ ఆ సినిమా వెంకటేష్ తోనే చేద్దామని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినప్పటికీ ఆయనకి ఉన్న కమిట్ మెంట్ వల్ల ఆయన ఆ సినిమా మీద ఎక్కువగా ఫోకస్ పెట్టలేదు అని తెలుస్తుంది. ఇక దాంతో ఈ సినిమాలో మహేష్ బాబు నటించడమే కాకుండా అప్పటివరకు తనకున్న ఇమేజ్ ని మార్చుకొని ఈ సినిమా తో ఒక ప్రత్యేక గుర్తింపు ని సంపాదించుకున్నాడు.
ఇక ఈ సినిమాలో మహేష్ బాబు మాట్లాడేది తక్కువే అయినప్పటికీ ఆయన మాట్లాడిన మాటలు మాత్రం ప్రేక్షకులందరికీ బాగా గుర్తుండిపోయాయి. ఇక అలాగే ఈ సినిమాను ఇప్పటికీ ప్రేక్షకులు చూస్తూనే ఉంటారు అంటే త్రివిక్రమ్ ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పటికీ కూడా ఈ సినిమాకి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.టివిలో వచ్చిందంటే మిస్ అవ్వకుండా ఈ సినిమాని చూసే జనాలు ఇప్పటికి ఉన్నారంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు…