Chiranjeevi: ప్రస్తుతం చిరంజీవి వశిష్ట డైరెక్షన్ లో విశ్వంభర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని సినిమా యూనిట్ తో పాటు అభిమానులు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయితే ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. ఇక 2025 వ సంవత్సరంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఇంతకుముందే మేకర్స్ చెప్పారు.
ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ఏంటంటే చిరంజీవి ఈ సినిమాలో డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ లో నటిస్తున్నాడు. ఇక దానికి సంబంధించి చిత్రీకరణ కూడా జరుపుకుంటుంది ఇక ఇలాంటి క్రమంలో ఈ సినిమా సోషియో ఫాంటసీ జానర్ లో సాగుతుంది కాబట్టి ఈ సినిమాలో దేవకన్య పాత్ర ఉందని అది ఈ సినిమాకి హైలెట్ గా నిలవబోతుందని ఫిలిం మేకర్స్ చెప్తున్నారు. అయితే అది సినిమాలో ఒక 10 నిమిషాల నిడివి తో సాగే పాత్ర కావడంతో పాటుగా ఆ క్యారెక్టర్ చిరంజీవి తో ఒక సాంగ్ కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక దానికోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన దీపికా పదుకొనే ని తీసుకోవాలని ఉద్దేశ్యం లో సినిమా యూనిట్ ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఇప్పటికే ఆమెతో చర్చలు కూడా జరిపినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి అభిమానులు అందరూ కూడా దీపికా పదుకొనే చిరంజీవితో స్టెప్పులు వేయబోతుంది అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్స్ చేస్తున్నారు. అయితే నిజానికి ఈ క్యారెక్టర్ చేస్తానని తను ఒప్పుకుందా లేదా అనే విషయాలు మాత్రం ఇప్పటివరకు ఇంకా బయటికి రాలేదు. కానీ ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో వస్తుంది కాబట్టి దీపిక పదుకొనే సినిమాలో ఉంటే సినిమాకి కూడా చాలా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశ్యం తోనే తనని ఈ క్యారెక్టర్ లోకి తీసుకోవాలని డైరెక్టర్ అనుకున్నట్టుగా తెలుస్తుంది.
దీంతో ఆమె కనక ఈ క్యారెక్టర్ లో చేస్తే ఈ సినిమా రేంజ్ మరింత పెరిగే అవకాశం కూడా ఉందని సినిమా పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే వశిష్ఠ ఇంతకుముందు బింబిసార అనే సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకొని డైరెక్ట్ గా చిరంజీవిని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక దీంతో ఈ సినిమా మీద వశిష్ట చాలా ఎఫర్ట్స్ కూడా పెడుతున్నట్టు గా తెలుస్తుంది.ఇక ఆయన పడే కష్టం ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తుంది…