Homeఎంటర్టైన్మెంట్ఆ హీరో డబ్బు రోడ్డు పైకి విసిరేసేవాడట !

ఆ హీరో డబ్బు రోడ్డు పైకి విసిరేసేవాడట !

రియల్‌ స్టార్‌ అని శ్రీహరికి స్క్రీన్ బిరుదు ఉంది. కానీ, శ్రీహరి నిజంగానే రియల్ స్టార్. ఎవరికీ ఏ ఆపద వచ్చినా శ్రీహరి ఇంటికి వెళ్లేవారు. అప్పట్లో ఎవరైనా తన ఇంటి ముందుకు వస్తే శ్రీహరి బాల్కనీలో నిల్చొని వాళ్లకు రకరకాలుగా సాయం అందించేవారు. ముఖ్యంగా వాచ్ మెన్ రూమ్ లో ఎప్పుడు భోజనం ఉండేలా చూసేవారు. అలా నిత్యం ఎంతో మందికి భోజనం పెట్టేవాడు.

ఇక ఆర్ధిక ఇబ్బందులతో తన ఇంటి దగ్గరకు ఎవరైనా వస్తే.. కొంత డబ్బుకు రాయికట్టి దానిని గుడ్డలో చుట్టి వారికీ అందేలా రోడ్డుపైకి విసిరేసేవారట. అలా శ్రీహరి నుండి డబ్బు తీసుకున్న వాళ్ళల్లో ఎంతోమంది సినిమా వాళ్లతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఉండేవారు. అలాగే సామాన్య ప్రజల భూమిని ఎవరైనా కబ్జా చేస్తే.. ఆ భూమి ఎవరిదో వారికి అండగా నిలబడి న్యాయానికి బాసటగా నిలిచేవాడు శ్రీహరి.

ఈ విషయాలను తాజాగా హాస్యనటుడు పృథ్వీరాజ్‌ చెప్పుకొచ్చాడు. ఆయన బెనర్జీ, సుదర్శన్‌, జ్యోతిలతో కలిసి ఈటీవీలో సుమ వ్యాఖ్యాతగా ప్రసారమయ్యే ‘క్యాష్‌’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమ తనదైన పంచులతో అలరించగా, సుమకి పోటీగా కమెడియన్లు కూడా పంచ్ డైలాగ్‌లతో, ఫన్నీ టాస్క్‌లతో సందడి చేస్తూ మంచి ఫన్ జనరేట్ చేశారు.

ఇక ఈ షోలో నటుడు బెనర్జీ ఉదయ్‌కిరణ్‌ గురించి మాట్లాడుతూ.. ‘హీరో ఉదయ్‌కిరణ్‌ చనిపోవడం ఒక విధి. తనకు చాల తక్కువ టైంలోనే లవర్‌ బాయ్‌ గా గొప్ప ఇమేజ్‌ వచ్చింది. ఆ తర్వాత తన కెరీర్ గాడి తప్పింది. నేను తనతో ఎప్పుడు చెబుతూ ఉండేవాడిని. నీకు పెళ్లైంది. భార్య ఉంది. సినిమాలు కూడా చేస్తున్నావు. జీవితాన్ని ఎంజాయ్‌ చెయ్‌’ అని, కానీ.. జరగకూడని జరిగిపోయింది’ అంటూ ఎమోషనల్ గా ఉదయ్ కిరణ్ గురించి చెప్పుకొచ్చాడు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version