Balakrishna: నట సింహం బాలయ్య నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టిన 50 ఏళ్ళు అవుతుంది. 1974లో తాతమ్మ కల చిత్రంతో బాలకృష్ణ సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యాడు. తండ్రి ఎన్టీఆర్ నట వారసత్వాన్ని నిలబెడుతూ టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరిగా ఎదిగాడు. సుదీర్ఘ సినిమా ప్రయాణంలో బాలకృష్ణ అనేక ప్రయోగాత్మక చిత్రాలు చేశారు. సాంఘిక, జానపద, సోషియో ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, డివోషనల్ జోనర్స్ లో చిత్రాలు చేశాడు. బాలకృష్ణ పేరిట అనేక బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు 108 చిత్రాల్లో ఆయన నటించారు.
బాలకృష్ణ నట ప్రస్థానం ఐదు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా టాలీవుడ్ స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించాలని తలపెట్టారు. హైదరాబాద్ వేదికగా సెప్టెంబర్ 1న ఈ వేడుకను ఘనంగా జరపాలని ఏర్పాట్లు చేస్తున్నారు. టాలీవుడ్ నుండి చిరంజీవి, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు ప్రముఖులను కమిటీ పెద్దలు స్వయంగా కలిసి ఆహ్వానించారు. ఇతర పరిశ్రమలకు చెందిన రజినీకాంత్, శివ రాజ్ కుమార్ తో పాటు మరికొందరు హాజరయ్యే అవకాశం కలదు.
కాగా ఓ స్టార్ హీరో మాత్రం ఈ వేడుకకు నేను రానని మొహమాటం లేకుండా చెప్పారట. కారణం తెలియదు కానీ మరో బడా ఫ్యామిలీకి చెందిన ఆ సీనియర్ హీరోకి బాలయ్య అంటే గిట్టదు. ఇద్దరూ ఎన్నడూ కలిసిన సందర్భం లేదు. ఆ మధ్య బాలయ్య చేసిన కామెంట్స్ ఆ హీరోతో పాటు కుటుంబ సభ్యులను బాధించాయి. అప్పటి నుండి సదరు హీరో మరింత దూరమయ్యాడు.ఇక ఆ హీరోని ఆహ్వానించేందుకు కమిటీ పెద్దలు ఇంటికి వెళ్లగా సాదరంగా ఆహ్వానించాడట. అయితే బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలకు హాజరు కాలేనని చెప్పాడట.
తనకు చాలా పనులు ఉన్నాయి. సమయం దొరకదని తెగేసి చెప్పాడట. బాలయ్య వేడుకకు రావడం ఇష్టం లేకే ఆ హీరో సాకులు చెప్పాడనే వాదన గట్టిగా వినిపిస్తోంది. ఈ విషయం పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు పవన్ కళ్యాణ్-అల్లు అర్జున్ బాలయ్య స్వర్ణోత్సవ సంబరాలకు హాజరు కావడం చర్చకు దారి తీసింది. మెగా-అల్లు ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. జనసేన నేతలు నేరుగా అల్లు అర్జున్ కి వార్నింగ్ ఇచ్చారు. పుష్ప 2 మూవీని విడుదల కానీయం అని అల్టిమేటం జారీ చేశారు. మరోవైపు అల్లు అర్జున్ తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ఈ క్రమంలో అల్లు అర్జున్-పవన్ కళ్యాణ్ బాలయ్య స్వర్ణోత్సవ వేడుకల్లో ఎదురు పడతారా? పడితే మాట్లాడుకుంటారా? లేదా అనే చర్చ నడుస్తోంది…
Web Title: That star hero was a shock to balakrishna
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com