Balayya: ఒక సినిమా ఫ్లాప్ అయితేనే మూవీ యూనిట్ సభ్యులు చాలా బాధపడిపోతుంటారు. ఇక హీరో అయితే అలా ఎందుకు జరిగిందని ఆలోచించి ఇంకా ఎక్కువ బాధపడిపోతుంటాడు. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలు ఫ్లాప్ అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి.. అలా మూడు సినిమాలు ఫ్లాప్ అయినా వాటి గురించి పెద్దగా పట్టించుకోకుండా నాలుగో సినిమాతో సక్సెస్ అందుకున్నారు ఆ హీరో.. ఆయనెవరో కాదు నందమూరి నటసింహం బాలయ్య.

కొవిడ్ మహమ్మారి వల్ల ఏర్పడిన పరిస్థితులకు ముందర అనగా 2019లో బాలయ్య నటించిన మూడు సినిమాలు విడుదలయ్యాయి. మూడు కూడా అనుకున్న స్థాయిలో ఆడలేదు. అవేంటంటే.. సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్‌గా వచ్చిన రెండు పార్ట్స్ ‘ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు’. ఈ బయోపిక్‌ను జనాలు అంతగా ఆదరించలేదు. ఈ రెండు చిత్రాలు అంతగా ఆకట్టుకోలేదు. ఈ నేపథ్యంలో బాలయ్య నటించిన ‘రూలర్’ సినిమాపైన ప్రేక్షకులు, బాలయ్య అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఆ మూవీ కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది.
వరుసగా మూడు సినిమాలు డిజాస్టర్స్‌గా నిలిచాయి. అయితే, ప్రస్తుతం బాలయ్య నటించిన ‘అఖండ’ చిత్రానికి మాత్రం ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. కేవలం ఏడు రోజుల్లోనే ఈ సినిమా రూ.50 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. అయితే, ఈ ‘అఖండ’ సినిమాకు మొదట్లో నార్మల్ టాకే వచ్చింది. గొప్ప టాక్ రాకపోయినప్పటికీ సినిమాకు ‘అఖండ’మైన ఆదరణ అయితే లభిస్తోంది. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఫిల్మ్‌తో సినిమాకు రూ.60 కోట్ల షేర్ మార్కు రావడం విశేషం. ఇలా కావడం బాలయ్యకే చెల్లిందని సినీ అభిమానులు అంటున్నారు.
Also Read: Prabhas: ఓ ఇంటివాడు కాబోతున్న ప్రభాస్.. ఆ ప్రాంతంలో కోటలాంటి భవన నిర్మాణానికి ఏర్పాట్లు?
వేరే టాలీవుడ్ స్టార్స్ తో పోలిస్తే బాలయ్య సినిమాల పరిస్థితులు భిన్నంగా ఉంటాయని ఈ సందర్భంగా నందమూరి అభిమానులు అంటున్నారు. వేరే హీరోల చిత్రాలకు నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ కొంత వసూళ్లు ఉంటాయి. కానీ, బాలయ్య చిత్రానికి అలా ఉండబోదు. ఒకసారి సినిమాపై నెగెటివ్ టాక్ వస్తే అంతే సంగతులు అనే పరిస్థితులు ఉంటాయని అంటున్నారు. మొత్తంగా బాలయ్య వైవిధ్యతను ఆయన సినిమాలు తెలుపుతున్నాయి. సరైన సినిమా పడితే బాక్సాఫీసు షేక్ చేయడంలో బాలయ్య ముందుంటాడనేందుకు ‘అఖండ’ సినిమానే సాక్ష్యంగా ఉంటోంది.
Also Read: Tejaswi Madivada: “సర్కస్ కార్ 2” చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైన తేజస్వి మాదివాడ…