Allu Aravind: మలయాళ సెన్సేషన్ ‘2018’ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ తెలుగులో విడుదల చేశారు. ఈ చిత్ర సక్సెస్ మీట్లో పాల్గొన్న అల్లు అరవింద్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. నేను ఇద్దరు దర్శకులకు అవకాశాలు ఇచ్చాను. చందూ మొండేటికి నా బ్యానర్ లో సినిమా చేసే ఛాన్స్ ఇచ్చాను. కార్తికేయ 2 కంటే ముందే సినిమా అవకాశం ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ మా బ్యానర్లో మూవీ చేస్తున్నాడు. మరొక డైరెక్టర్ మాత్రం నన్ను మోసం చేశాడు. నేను అవకాశం ఇస్తే మాట నిలబెట్టుకోలేదు. ఆ డైరెక్టర్ పేరు నేను ఇప్పుడు చెప్పను అన్నారు.
ఆ డైరెక్టర్ ఎవరో అల్లు అరవింద్ చెప్పుకున్నప్పటికీ… కచ్చితంగా పరుశురామ్ గురించే అని అందరికీ తెలుసు. అల్లు అరవింద్ నిర్మించిన గీత గోవిందం భారీ హిట్. పరుశురామ్ కెరీర్ కి ఆ మూవీ టర్నింగ్ పాయింట్. ఆ మూవీ సక్సెస్ ఏకంగా మహేష్ బాబుతో మూవీ చేసే అవకాశం వచ్చేలా చేసింది. గీత గోవిందంతో పాటు గీతా ఆర్ట్స్ కి పరుశురామ్ మరో మూవీ చిత్రం చేస్తానని హామీ ఇచ్చాడు.
అనూహ్యంగా దిల్ రాజు వద్ద అడ్వాన్స్ తీసుకుని విజయ్ దేవరకొండతో మూవీ ఫిక్స్ చేశాడు. ఇది విబేధాలకు కారణమైంది. దిల్ రాజు మీద కూడా అల్లు అరవింద్ అలిగారు. పరుశరామ్ మీదనైతే అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. తనకు మూవీ చేయాల్సి ఉండగా, దిల్ రాజు బ్యానర్లో పరశురామ్ మూవీ ప్రకటించారు. దీంతో ప్రెస్ మీట్ పెట్టి పరుశురామ్ బండారం బయటపెట్టాలని డిసైడ్ అయ్యాడు. ఆ రోజు సాయంత్రం అల్లు అరవింద్ సంచలన ప్రెస్ మీట్ అంటూ ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో అల్లు అరవింద్ క్యాన్సిల్ చేశారు.
భార్యతో పాటు అల్లు అరవింద్ ఇంటికి వెళ్లిన పరుశురామ్ క్షమాపణలు చెప్పాడట. ఆయన చెడామడా తిట్టినా భరిస్తూ మీకు సినిమా చేస్తానని వేసుకున్నాడన్న వాదనలు వినిపించాయి. ఇది జరిగి కొన్ని నెలలు అవుతుండగా అల్లు అరవింద్ నేడు బరస్ట్ అయ్యారు. అలాగే అల్లు అరవింద్ జూనియర్స్ ని సీనియర్స్ తొక్కేయకూడదు అన్నారు. వారికి కూడా స్పేస్ ఇచ్చి ఎదిగేలా చేసినప్పుడే పరిశ్రమ బాగుంటుందని హితవు పలికారు. అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.