https://oktelugu.com/

Thangalaan: సెన్సార్ పూర్తి చేసుకున్న తంగలాన్… ఇక విక్రమ్ ఫ్యాన్స్ కి పూనకాలే…

విక్రమ్ హీరోగా వస్తున్న 'తంగలాన్ ' సినిమా ఆగస్టు 15 వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతుంది...ఇక ఈ క్రమం లో ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ ను కూడా చేపడుతున్నారు...శంకర్ డైరెక్షన్ లో ఆయన చేసిన అపరిచితుడు సినిమా 2005లో వచ్చి ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించింది. తమిళ్, తెలుగు రెండు లాంగ్వేజ్ ల్లో కూడా ఈ సినిమా భారీ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా విక్రమ్ ని రెండు భాషల్లో కూడా స్టార్ హీరోను చేసింది.

Written By:
  • Gopi
  • , Updated On : July 31, 2024 / 05:35 PM IST

    Thangalaan

    Follow us on

    Thangalaan: ఒక సంవత్సరంలో చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అందులో ఎక్కువ శాతం కమర్షియల్ సినిమాలే కావడమే విశేషం. ఇక వీటివల్లనే సినిమాలకి ఎక్కువ బిజినెస్ జరుగుతుంది. కాబట్టి దర్శక నిర్మాతలు ఎక్కువగా వీటి మీదనే ఫోకస్ చేస్తూ ఉంటారు. ఇక స్టార్ హీరోల సినిమాలైతే మొత్తం కమర్షియల్ జానర్లోనే తెరకెక్కుతూ ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా ఉంటాయి. అందుకే ఆయా సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. ఇక కొంత మంది స్టార్ హీరోలు మాత్రం అసలు కమర్షియల్ సినిమాలు చేయడానికి ఇష్టపడరు. అందులో తమిళ్ ఇండస్ట్రీ కి చెందిన విక్రమ్ ఒకరు…ఈయన ఎప్పుడు ఎక్స్పరిమెంటల్ సినిమాలు మాత్రమే చేస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు. అందువల్లే ఆయనకి తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి గుర్తింపు అయితే ఉంది. ఇక ఇక్కడ కూడా ఆయనకు చాలామంది అభిమానులు ఉన్నారు. వాళ్ళందరూ ఆయనను చాలా సక్సెస్ ఫుల్ హీరోగా చూస్తుంటారు. ఇక మొత్తానికైతే విక్రమ్ కెరియర్ లో ఆయన అందుకున్న సక్సెస్ లు చాలా తక్కువ అయినప్పటికీ ఆయన తన కెరియర్ ను ఇప్పటి వరకు బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాడు అంటే దానికి కారణం ఆయన చేస్తున్న ఎక్స్పరిమెంట్లనే చెప్పాలి. ఇక శంకర్ డైరెక్షన్ లో ఆయన చేసిన అపరిచితుడు సినిమా 2005లో వచ్చి ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించింది. తమిళ్, తెలుగు రెండు లాంగ్వేజ్ ల్లో కూడా ఈ సినిమా భారీ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా విక్రమ్ ని రెండు భాషల్లో కూడా స్టార్ హీరోను చేసింది.

    Also Read: సునీల్ విలనిజం పీక్స్, ఓటీటీలోకి వచ్చేసిన యాక్షన్ థ్రిల్లర్ టర్బో… ఎక్కడ చూడొచ్చు?

    కానీ ఆ తర్వాత ఆయన చేసిన ఏ సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ ని సాధించకపోవడంతో దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆయనకు ఒక్క హిట్టు కూడా లేకుండా కెరియర్ ను లాగిస్తూ వస్తున్నాడు. ఇక శంకర్ డైరెక్షన్ లోనే చేసిన ‘ఐ ‘ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నాడు. కానీ ఆ సినిమా ఆశించిన మేరకు ప్రేక్షకుల్ని అలరించలేదు. ఇక ఇప్పుడు పా.రంజిత్ డైరెక్షన్ లో ‘తంగలాన్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా మీద ఆయన పెట్టుకున్న అంచనాలను తప్పకుండా రీచ్ అవుతాడు అంటూ ఆ సినిమా యూనిట్ మంచి కాన్ఫీడెన్స్ ను వ్యక్తం చేస్తున్నారు.

    ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించకపోయిన కూడా ప్రేక్షకుల హృదయాల్లో మాత్రం ఆయనకు ఒక చెరగని ముద్రని వేశాయనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే పా రంజిత్ గత చిత్రాలు అయిన కబాలి, కాళి లాంటి సినిమాలు తెలుగులో పెద్దగా సక్సెస్ అయితే సాధించలేదు. ఆయన వరుసగా రజనీకాంత్ తో 2 సినిమాలు చేసినప్పటికీ ఆ రెండు సినిమాలు కూడా ఆశించిన మేరకు సక్సెస్ అయితే సాధించలేదు.

    దాంతో ఆయనకు తెలుగులో అంత పెద్ద గా మార్కెట్ అయితే క్రియేట్ అవ్వలేదు. అందుకే ఇప్పుడు ఎలాగైనా సరే తనను తాను స్టార్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం తోనే రొటీన్ కి భిన్నంగా ఆలోచించి ఈ సినిమాని చేశాడు. ఇక ఈ సినిమా ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో రీసెంట్ గా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమాను చూసిన సెన్సార్ బోర్డు వాళ్ళు దీనికి ఒక్క కట్ కూడా వేయకుండా యూ/ఏ సర్టిఫికెట్ ను ఇవ్వడం విశేషం…ఇక ఇది తెలుసుకున్న విక్రమ్ ఫ్యాన్స్ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక విక్రమ్ ఈ సినిమాలో చేసిన క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుందంటూ రీసెంట్ గా పా రంజిత్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఇక ఈ టీజర్ ని చూస్తే ఇదొక డిఫరెంట్ ఫిల్మ్ అనే విషయం మనకు చాలా ఈజీగా అర్థం అవుతుంది…

    Also Read: రష్మీ క్రేజ్ ముందు సుడిగాలి సుధీర్ తుస్… ఇవిగో లెక్కలు, స్టార్ యాంకర్ కుమ్మేసింది!