https://oktelugu.com/

Nirmala Sitharaman Vs Rahul Gandhi : రాహుల్ గాంధీపై లేడీ సింహంలా విరుచుకుపడిన నిర్మలా సీతారామన్

రాహుల్ గాంధీపై లేడి సింహంలా పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ విరుచుకుపడ్డారు. పార్లమెంట్ సమావేశాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By:
  • NARESH
  • , Updated On : July 31, 2024 / 05:35 PM IST

    Nirmala Sitharaman Vs Rahul Gandhi : బడ్జెట్ సమావేశాలు.. బడ్జెట్ ఉపన్యాసాలు చాలా చప్పగా సాగుతున్నాయి. ఒకనాడు బడ్జెట్ ఉపన్యాసాల కోసం పడిచచ్చేవారు. ఎందుకంటే ఉద్దండ నాయకులు ఉండేవారు. వారి ప్రసంగాలు చెవులు నిక్కించి వినేవారు. సరే ఇప్పుడు ఆ పద్ధతి లేకపోయినా.. ఆ ఒరవడిలో కొనసాగడం లేదు.

    రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు అయ్యాడు. అద్భుతమైన అవకాశం ఇదీ.. అందివచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటే ఆయన ఇమేజ్ పెరుగుతుంది. ఎప్పుడూ పాత పద్దతిలోనే రాహుల్ మాట్లాడుతున్నారు.

    అదానీ, అంబానీ, కులగణన.. అధికారులు ఏ కులం వారు.. అగ్ని వీర్ పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. పార్లమెంట్ లో బడ్జెట్ తప్ప అన్ని మాట్లాడుతున్నాడు. బడ్జెట్ చదవాలన్నా ఆసక్తి కూడా లేదు. ఇప్పటికీ రెండు దశాబ్ధాల రాజకీయంలో ఇప్పటికీ మెచ్చురిటీ రాలేదు. ఇది ఒక విభజన విచ్చిన్న కర ధోరణితో మాట్లాడుతున్నాడు.

    సమాజాన్ని విభజించే పద్ధతిలా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీపై లేడి సింహంలా పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ విరుచుకుపడ్డారు. పార్లమెంట్ సమావేశాలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.