Thandel: అక్కినేని నాగచైతన్య హీరోగా చందు మొండేటి డైరెక్షన్ లో వస్తున్న తండేల్ సినిమా ఈరోజు పూజ కార్యక్రమాలను జరుపుకుంటుంది. దీనికి వెంకటేష్ , నాగార్జున ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. చాలా రోజుల నుంచి ఈ సినిమాకు సంబంధించిన ప్రి ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.ఇక అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని గార మండలంలో మత్స లేశం అనే ఊరు కి సంబంధించిన కొంత మంది వ్యక్తులకు చెందిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ స్టోరీ ని తీసుకొని సినిమా చేస్తున్నారు.
అయితే ఈ సినిమా స్టోరీ చందు మొండేటిది కాదు మత్స లేశం అనే ఊరుకు సంబంధించిన కార్తీక్ అనే అబ్బాయి ఈ సినిమా స్టోరీ ని యదార్థ సంఘటనల ఆధారంగా రాసుకొని గత రెండు సంవత్సరాల కిందట అల్లు అరవింద్, బన్నీ వాసులను కలిసి ఈ కథ వినిపించాడు. ఈ కథ బాగా నచ్చిన అల్లు అరవింద్,బన్నీ వాసు కథను లాక్ చేశారు అయితే ఆ అబ్బాయి నేను డైరెక్షన్ చేస్తాను అని చెప్పిన వినకుండా అల్లు అరవింద్ అప్పటికే కార్తికేయ 2 సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్న చందు ముండేటి దగ్గరికి కథను తీసుకెళ్లి చెప్పారు.
దాంతో చందు మొండేటి దాంట్లో కొన్ని మార్పులు, చేర్పులు చేసి సినిమాకి అనుకూలంగా రెడీ చేసి నాగచైతన్య ని హీరోగా పెట్టి సినిమా చేయాలని ప్లాన్ చేశారు. అందుకే ఈ సినిమా కథ చందు మొండేటిది కాదు వేరే అబ్బాయి రాసుకున్న కథ ను తీసుకొని వీళ్ళు తండేల్ తెరకెక్కిస్తున్నట్టు గా ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇక ఈ సినిమా ఇండియా పాకిస్తాన్ నేపథ్యంలో సాగే సినిమా అనే విషయం కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.ఇక ఇది ఇలా ఉంటే చందు మొండేటి ఈ సినిమాతో సక్సెస్ కొడితే మరోసారి తను పాన్ ఇండియా డైరెక్టర్ గా మంచి గుర్తింపు సాధించడమే కాకుండా స్టార్ హీరోలు సైతం తనతో సినిమాలు చేయడానికి ముందుకు వస్తారు కాబట్టి ఈ సినిమా అనేది చందు మొండేటి కి చాలా కీలకమైన సినిమా…
అలాగే నాగచైతన్య కూడా ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తే పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి.ఇక ఈ సినిమా మీదనే వీళ్ల లైఫ్ అనేది ఆధారపడి ఉంది కాబట్టి ఈ సినిమాని చాలా జాగ్రత్తగా తెరకెక్కించే ప్రయత్నం అయితే మేకర్స్ చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే ఈ సినిమాలోని చాలా సీన్స్ ని రియల్ లోకేషన్ లో షూట్ చేయాలని భావించి ఇప్పటికే ఆ సినిమా టీమ్ మొత్తం లొకేషన్స్ ని చూసి ఫైనల్ చేసిన వీడియో ఒకటి అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది…